News February 9, 2025
HYD: బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు!

నార్సింగి PS పరిధిలో బాలికపై అత్యాచారం జరిగిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను మధుసూదన్, జయంత్, సాయి, తరుణ్ అత్యాచారం చేసి ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆమె రూ.10వేలు వారికి ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడీగా ఉంటున్న బాలికను తల్లి నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిని శుక్రవారం రిమాండ్ చేశారు.
Similar News
News February 9, 2026
హైదరాబాద్: తిండి కంటే ఫొటోలకే క్రేజ్!

హైదరాబాద్ పోరగాళ్లది మామూలు రచ్చ కాదు. ఇప్పుడు తిండి రుచి కంటే కూడా అది కెమెరాలో ఎట్లా కనిపిస్తుందనేదే ముఖ్యం. నియాన్ లైట్ల కొరియన్ ఫుడ్ దగ్గర మొదలుపెట్టి, మంటలు పుట్టించే ఫైర్ నూడుల్స్ దాకా అన్నీ రీల్స్ కోసమే. ప్లేటులో చీజ్ ఊగినా, పొగలు కక్కినా అదో వైరల్ సెన్సేషన్. కడుపు నిండడం సంగతేమో కానీ వీడియో క్రేజీగా రాకపోతే వీళ్లకు ఆ క్యాలరీలు దండగన్నమాట. డ్రామా ఉంటేనే మన జెన్-జీకి అసలైన దావత్.
News February 9, 2026
HYD: ఖాతాలోకి పైసలు.. కానీ గుండెల్లో రైళ్లు!

కార్పొరేట్ ఆట కట్టించేందుకు సర్కారు ‘DBT’ అస్త్రం విసిరింది. “నీ ఫీజు నీ చేతికే” అంటున్న.. ఏదో తిరకాసు ఉందని టాక్. గ్రేటర్‌లోని 3.5 లక్షల మంది పేద విద్యార్థులకు నిధులు టైముకు రాకపోతే గతేంటి? గతంలో కాలేజీలు సర్కారు కోసం ఎదురుచూసేవి, ఇప్పుడు విద్యార్థులే మేనేజ్‌మెంట్ల ముందు నిలబడాల్సిన పరిస్థితి. ఈ పద్ధతి కాలేజీలను దారికి తెస్తుందా?, విద్యార్థులను అప్పుల ఊబిలో ముంచుతుందా! అనేది చర్చనీయాంశమైంది.
News February 9, 2026
GHMC 3 ముక్కలు.. బాస్ ఆయనే!

GHMCని 3 ముక్కలు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. HYD, CYB, మల్కాజిగిరి వేర్వేరు కార్పొరేషన్లు కొలువుదీరనున్నాయి. ‘స్పెషల్ ఆఫీసర్’గా Special CS జయేశ్ రంజన్‌ను రంగంలోకి దించుతోంది. సైబరాబాద్ కార్పొరేషన్ పగ్గాలు పి.సృజనకు, మల్కాజిగిరి బాధ్యతలు వినయ్ కృష్ణారెడ్డికి అప్పగించే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నికలు ముగిసే వరకు గ్రేటర్ ప్రధాన కమిషనర్‌గా RV కర్ణన్ చక్రం తిప్పనున్నారు. రేపు GO విడుదల కానుందని సమాచారం.


