News February 9, 2025
HYD: బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739067413405_51938607-normal-WIFI.webp)
నార్సింగి PS పరిధిలో బాలికపై అత్యాచారం జరిగిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను మధుసూదన్, జయంత్, సాయి, తరుణ్ అత్యాచారం చేసి ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆమె రూ.10వేలు వారికి ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడీగా ఉంటున్న బాలికను తల్లి నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిని శుక్రవారం రిమాండ్ చేశారు.
Similar News
News February 11, 2025
ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738636853991_1226-normal-WIFI.webp)
TG: రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. సాధారణం కన్నా నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. మరోవైపు సోమవారం ఖమ్మంలో 35, హైదరాబాద్లో 32 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.
News February 11, 2025
సముద్ర స్నానాలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739200033145_52225865-normal-WIFI.webp)
ఈ నెల 12వ తేదీన మాఘ పౌర్ణమి పండుగ పురస్కరించుకొని జిల్లాలో ప్రజలు పుణ్యస్నానాలు చేసే ప్రదేశాలలో ప్రజలకు అసవరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని అనకాపల్లి కలెక్టరు విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. మాఘ పౌర్ణమి ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు షెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
News February 11, 2025
యాదాద్రిలో శ్రీవారి ఆదాయం రూ.22,60,628
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739208583761_50308805-normal-WIFI.webp)
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. ప్రధాన బుకింగ్, వీఐపీ, బ్రేక్ దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణ కట్ట, వ్రతాలు, యాద ఋషి నిలయం, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, అన్నదాన విరాళాలు, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.22,60,628 ఆదాయం వచ్చిందని ప్రకటించారు.