News July 22, 2024
HYD: బాలికలపై లైంగిక వేధింపులు ఆపండి: పోలీసులు

‘బాలికలపై లైంగిక వేధింపులను ఆపండి.. పిల్లలని చైతన్యపరుద్దాం’ అంటూ రాచకొండ కమిషనరేట్ పోలీసులు పిలుపునిచ్చారు.
☛ప్రవర్తనలో ఆకస్మిక మార్పు
☛ఇతరుల నుంచి దూరంగా ఉండటం
☛శరీరంలో అనుమానాస్పద, వివరించలేని మార్పులు
☛భయపడుతూ ఉండటం
☛ఆహారం, నిద్రలో మార్పులు ఉంటే ఆరా తీయాలన్నారు. ఇదే సమయంలో పిల్లలకు కీలక సూచన చేశారు. శరీర భాగాలను ఎవరైనా తాకితే పేరెంట్స్ లేదా 1098, 100, 101కు డయల్ చేయాలన్నారు.
SHARE IT
Similar News
News November 27, 2025
HYD: విషాదం..11 ఏళ్లకే సూసైడ్

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన వెలుగుచూసింది. సుభాష్‌నగర్‌లో నివాసం ఉండే బాలుడు(11) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడు మృతదేహాన్ని పరిశీలించారు. సూసైడ్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చిన్న వయసులో బాలుడి కఠిన నిర్ణయం స్థానికులను కలచివేసింది.
News November 27, 2025
HYD: FREEగా వెళ్లొద్దాం రండి!

HYD పరిధి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం జరుగుతోంది. నవంబర్ 30 వరకు ఉ.10 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ ఉంటుందని HYD టూరిజం తెలిపింది. ఉచితంగా రాష్ట్రపతి నిలయం, వివిధ రకాల, కళలు వీక్షించే అవకాశం ఉంది. సా.7:00 వరకు లాస్ట్ ఎంట్రీగా పేర్కొన్నారు. QR కోడ్ స్కాన్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి.
News November 27, 2025
అయోధ్య ఆలయంలో హైదరాబాద్ కిటికీలు

కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిథాని) సంస్థ అయోధ్యలోని రామాలయం కోసం కిటికీలను తయారుచేసింది. టైటానియం ఆర్కిటెక్చరల్ విండోలను తయారుచేసి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి అందజేసినట్లు మిథాని అధికారులు తెలిపారు. 31 కీటికీలను తయారు చేసి ఆలయానికి ఇచ్చామని వివరించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రదక్షణ కారిడార్ కోసం ఇంజినీరింగ్ విభాగం వీటిని తయారుచేసింది.


