News July 29, 2024
HYD: బాలిక బ్రెయిన్ డెడ్.. పది మందికి ప్రాణదానం

బ్రెయిన్‌డెడ్ అయిన బాలిక అవయవాలతో మరో పది మందికి ప్రాణం పోశారు. మేడ్చల్‌కు చెందిన శ్రీనివాస్, సరిత దంపతుల రెండో కూతురు దీపిక(16) ఈనెల 22న ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలింది. యశోద ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరిక్షించి బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపారు. తల్లిదండ్రులు బాలిక అవయవాలు దానం చేయాలని నిర్ణయించారు. 25న బాలిక మృతి చెందటంతో అవయవాలతో పది మందికి ప్రాణం పోశారు
Similar News
News December 21, 2025
హైదరాబాద్‌లో DANGER ☠️

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ శనివారం 255కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT
News December 21, 2025
HYD: KCR కోసం కాంగ్రెస్ WAITING

అసెంబ్లీ ఎన్నికల అనంతరం దాదాపు ఫామ్ హౌస్‌కే పరిమితమైన BRS అధినేత KCR నేడు తెలంగాణ భవన్‌కు రానున్నారు. BRSLP సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారో అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక అధికార పార్టీ నాయకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు సాధారణ ప్రజలు కూడా ఆయన గళం కోసం వెయిటింగ్.
News December 21, 2025
సిరి గోల్డ్‌తో నాకు సంబంధంలేదు: BJP ఖమ్మం చీఫ్

సిరి గోల్డ్ వ్యాపారంతో తనకెలాంటి సంబంధంలేదని BJP ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు స్పష్టంచేశారు. రాజకీయంగా ఎదురుకోలేకే అందులో పెట్టుబడులు పెట్టానని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వారి చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. త్వరలోనే వారిపై పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు. ప్రజలు ఈ నిరాధార ఆరోపణలు నమ్మొద్దని కోరారు.


