News July 17, 2024
HYD: బాలుడిని పీక్కుతిన్న కుక్కల పట్టివేత
విహాన్ అనే బాలుడిని కుక్కలు పీక్కుతిని చంపేసిన ఘటనతో జవహర్‌నగర్ మున్సిపల్ అధికారులు అప్రమత్తం అయ్యారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో <<13645143>>కుక్కలను పట్టుకుని<<>> బర్త్ కంట్రోల్ సెంటర్‌కు తరలించారు. కాగా, మంగళవారం రాత్రి సుమారు 20 కుక్కలు 20 నిమిషాల పాటు దాడి చేసి చిన్నారిని చంపినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై CM రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, చర్యలకు ఆదేశించారు.
Similar News
News December 11, 2024
HYD: ‘మళ్లీ మళ్లీ ఢిల్లీ.. ఇదే రేవంత్ లొల్లి’
HYD నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లటంపై ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. ‘మళ్లీ మళ్లీ ఢిల్లీ.. ఇదే రేవంత్ లొల్లి. గల్లీలో అధికారం, ఢిల్లీలో బేరసారం. ప్రజలు వరదల్లో ఉన్నా, నిరుద్యోగులు రోడ్డెక్కినా, విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రులపాలైనా, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. పదవులు నిలుపుకోవడానికి, కార్పొరేషన్ కమిషన్లకు ఢిల్లీ పోవాల్సిందే’ అంటూ మండిపడ్డారు.
News December 11, 2024
HYD: 5 రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 11, 2024
ఉప్పల్‌లో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్
HYDలోని ఉప్పల్‌లో సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ ఇంక్యుబేటర్ కేంద్రాన్ని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ మిథాలీ రాజ్ సందర్శించారు. ఆమె ఈ పర్యటన తమకు ఎంతో ప్రోత్సాహం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు, అసిస్టెంట్లు తెలిపారు. ప్రతి రంగంలో రాణించేందుకు చేయాల్సిన కృషి, పట్టుదల ఆమె మాటలు తెలిపాయన్నారు.