News March 30, 2025
HYD: బాలుడిపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

HYDలో బాలుడిపై అత్యాచారం చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడింది. బాలానగర్ PS పరిధిలో 2022లో పోక్సో కేసు నమోదైంది. కేసు పూర్తి వివరాలు.. ఫిరోజ్‌గూడకు చెందిన బర్కత్ అలీ(21) ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం చేసి అరెస్టయ్యాడు. తాజాగా కూకట్‌పల్లిలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జ్ విక్రమ్‌తో కూడిన ధర్మాసనం దోషిగా తేల్చి, 20 సం.రాల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.
Similar News
News April 3, 2025
మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు

మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కలెక్టరేట్‌ను పేల్చేస్తామని, కలెక్టర్‌ను చంపేస్తామంటూ ఓ అగంతకుడు మెయిల్ పెట్టారు. ఈ విషయంపై విచారణ జరపాలని కలెక్టర్ గౌతమ్ డీసీపీ పద్మజ రెడ్డికి ఆదేశాలు ఇచ్చారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అనే అంశంపై విచారణ చేస్తున్నారు. కాగా.. కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు నేపథ్యంలో ఉన్నతాధికారులు అత్యవసర సమావేశమయ్యారు.
News April 3, 2025
అత్తాపూర్‌లో 7 ఏళ్ల బాలుడి హత్య

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్డెన్ సిటీలో దారుణ ఘటన జరిగింది. 7 ఏళ్ల బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీని దుండగులు మీరాలం ట్యాంక్ సమీపంలో పడేశారు. ఈ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హత్యకు గురైన బాలుడు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చుట్టు పక్కన పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. బాలుడి హత్య వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.
News April 3, 2025
ఎలక్ట్రానిక్ పరికరాల బహిరంగ వేలం

రాచకొండ కమిషనరేట్ పరిధి అంబర్‌పేటలోని CAR పరేడ్ గ్రౌండ్, హెడ్ క్వార్టర్స్‌లో వస్తువులను బహిరంగ వేలం నిర్వహించాలని రాచకొండ కమిషనరేట్ నిర్ణయించింది. టేబుల్స్, కుర్చీలు, UPS బ్యాటరీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, బారికేడ్‌లు, రిఫ్లెక్టివ్ జాకెట్లు, బొల్లార్డ్‌లు మొదలైన వస్తువులను సొంతం చేసుకోవాలనుకున్నవారు. ఈ నెల 4న ఉ.10.30 గంటలకు వేలంలో పాల్గొనవచ్చు. # SHARE IT