News March 23, 2024

HYD: బాలుడి ప్రాణం తీసిన వీధి కుక్క

image

HYDలో వీధి కుక్కలు మరో బాలుడి ప్రాణం తీశాయి. బాధితులు తెలిపిన వివరాలు.. HYD శామీర్‌పేట్ పరిధి పెద్దమ్మ కాలనీలో భవన నిర్మాణ మేస్త్రీ బాలు.. కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి పెద్ద కుమారుడు ప్రవీణ్ (11) ఈనెల 18న ఇంటి ముందు ఉండగా ఓ వీధి కుక్క దాడి చేసి కరిచింది. బాలుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు.

Similar News

News April 17, 2026

గంటలోపు ఆసుపత్రికి చేరిస్తే రూ.25వేల రివార్డు: మంత్రి

image

నాగోల్ డ్రైవింగ్ సెంటర్‌లో ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనదారులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రమాద బాధితులను గంటలోపు ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడితే రూ.25వేల నగదుతో ‘రహవీర్ అవార్డు’ ఇస్తామని ప్రకటించారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

News April 17, 2026

HYD: కాగితాల్లో 501.. నేల మీద 185..! (2)

image

చెరువుల బదిలీలో భారీ స్కామ్ జరిగిందా? GO 120 (2010) ప్రకారం 501 చెరువులను గుర్తించి, అందులో 399 మున్సిపల్ శాఖకు అప్పగించారు. కానీ పదేళ్లలోనే ఈ సంఖ్య 185కి ఎలా పడిపోయింది? హిమాయత్‌సాగర్ పరిధిలో 40 శాతం నీటి విస్తీర్ణం మాయమై, కాంక్రీట్ కోటలు వెలిశాయి. హుడా మాస్టర్ ప్లాన్ లెక్కలకూ, ఇప్పటి పరిస్థితికీ పొంతన లేదు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న <<19672164>>చెరువులు క్షేత్రస్థాయిలో<<>> కనిపించడం లేదు.

News April 17, 2026

HYD: 1990లోనే నగర చెరువుల మరణశాసనం! (1)

image

నగర చెరువుల మరణశాసనం 1990ల్లోనే మొదలైంది. 10 హెక్టార్ల లోపు ఉన్న కుంటలను నివాస ప్రాంతాలుగా మార్చుకోవచ్చన్న ప్రభుత్వ నిర్ణయంతో 3,000కు పైగా నీటి వనరులు కనుమరుగయ్యాయి. 60 వేల చెరువుల లెక్కలున్నా నిజాం కాలం నాటి ఉర్దూ రికార్డులను కావాలనే తొక్కిపెట్టారా? రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనం కోసమే ఈ అదృశ్య పర్వం సాగిందా? అన్నట్లు తయారైంది. నేడు మిగిలిన కొద్దిపాటి జలవనరుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది.