News March 14, 2025

HYD: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

షాద్‌నగర్‌లో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI

Similar News

News October 19, 2025

నేడు వేములవాడ రాజన్న దర్శనాలపై క్లారిటీ..?

image

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు సాయంత్రం 5 గంటలకు శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరుకానున్నారు. ఈ రోజు సాయంత్రం రాజన్న దర్శనంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్దిరోజులుగా రాజన్న దర్శనాలపై సందిగ్ధత నెలకొంటున్న విషయం తెలిసిందే.

News October 19, 2025

HYD: మంత్రి పేషీ అడ్డాగా ఐటీ ప్రాజెక్ట్‌ పేరుతో మోసం

image

సచివాలయం ఐటీ మంత్రి పేచీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ఐటీ ప్రాజెక్ట్‌ మంజూరు చేస్తామంటూ మోసం చేశారు. మియాపూర్‌ ఐటీ ఇంజినీర్‌ను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో రూ.1.77 కోట్లు కాజేశారు. మంత్రి ఓఎస్‌డీ లెటర్‌హెడ్‌లు, నకిలీ పత్రాలు చూపి మోసగాళ్లు నమ్మించారు. బాధితుడి ఫిర్యాదుతో ఆరిగురిపై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణను సీసీఎస్‌కు బదిలీ చేశారు.

News October 19, 2025

సామర్లకోటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

గడచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 1,026 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటున జిల్లా వర్షపాతం 48.9 గా నమోదైంది. అత్యధికంగా సామర్ల కోటలో 132.4, అత్యల్పంగా కరపలో 12.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 21 మండలాల్లో కూడా వర్షం పడినట్లు అధికారులు వెల్లడించారు.