News March 14, 2025
HYD: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

షాద్‌నగర్‌లో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI
Similar News
News March 8, 2026
యాదాద్రి: గిరి ప్రదక్షిణ భక్తులకు ‘ఉచిత దర్శనం’

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం (స్వాతి) సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు ఆలయ అధికారులు తీపి కబురు అందించారు. ప్రదక్షిణలో పాల్గొన్న వారికి ప్రత్యేకంగా ఉచిత దర్శన టోకెన్లను పంపిణీ చేస్తున్నారు. స్వామివారి నిజాభిషేకం అనంతరం ఈ టోకెన్లు ఉన్న భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. అధికారుల నిర్ణయంపై సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 8, 2026
KMR: మహిళే ఓదార్పు

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ.. పురుషుల్లోని క్రూరత్వం మానవత్వాన్ని చంపేస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ఓ చోట అత్యాచారం, మరోచోట పెత్తనంతో హత్యాచారం, ఇంకోచోట పిల్లలను కడతేర్చే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మహిళా దినోత్సవం రోజు మాత్రమే మహిళలకు గౌరవం దక్కుతుందే తప్పా మిగతా రోజులు మిథ్యగానే మారుతున్నాయి.
News March 8, 2026
ఫైనల్ మ్యాచ్ క్రేజ్.. ధరలు భారీగా పెంచేశారు!

భారత్, NZ మధ్య నేడు T20WC ఫైనల్ జరగనున్న నేపథ్యంలో అహ్మదాబాద్‌లో హోటల్ రూముల ధరలు కొండెక్కాయి. లగ్జరీని బట్టి ఒక్క రాత్రి బసకు రూ.18 వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక పలు ఎయిర్‌లైన్స్ ప్రధాన నగరాల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక సర్వీసులు నడుపుతుండగా వాటి ధరలకూ రెక్కలొచ్చాయి. ఇక స్టేడియంలోని లక్షా 30వేల టికెట్లు అమ్ముడుపోగా, 15వేల మంది పోలీసులు స్టేడియం వద్ద భద్రత కల్పిస్తున్నారు.


