News February 2, 2025
HYD: బిల్డర్ వేణుగోపాల్ రెడ్డిది ప్రభుత్వ హత్యే: హరీశ్

ఒకప్పుడు బిల్డర్ అంటే లోన్లు ఇస్తామని బ్యాంకులు వెంటపడేవని రేవంత్ ప్రభుత్వం వచ్చాక బ్యాంకులు లోన్లు ఇవ్వమంటూ ముఖం చాటేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. బిల్డర్ వేణుగోపాల్ రెడ్డిది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్నారు. వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని చూస్తే బాధేస్తోందని చెప్పారు.
Similar News
News November 27, 2025
తిరుమల వివాదం.. సీఐడీ మకాం విజయవాడలో.!

తిరుమల పరకామణీ చోరీ కేసు డిసెంబర్ 2వ తేదీ నివేదిక కోర్టుకు సమర్పించాల్సిన నేపథ్యంలో సీఐడీ బృందం వేగంగా విచారణ చేస్తోంది. ఇప్పటికే పలువురు అధికారులు, బోర్డు సభ్యులను విచారించిన అధికారులు వైవీ సుబ్బారెడ్డి, పూర్వపు తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డితో సహా మరికొంత మందిని విచారణకు పిలవనున్నారు. తిరుపతిలో ప్రారంభమైన విచారణ ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా సాగుతోంది.
News November 27, 2025
సాధారణ ప్రసవాలు చేయాలి: మంచిర్యాల DMHO

జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలజిస్టులందరూ సాధారణ ప్రసవాలకు ముందుండాలని, సిజేరియన్లకు దూరంగా ఉండాలని DMHO డా.అనిత ఆదేశించారు. జిల్లా కార్యాలయంలో ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలజిస్టులతో ఆసుపత్రులలో ప్రసవాలు, లింగ నిర్ధారణపై గురువారం సమీక్ష నిర్వహించారు. మొదటి ప్రసవానికి వచ్చే వారికి సాధారణ ప్రసవం చేయాలన్నారు. ధరల పట్టికలు, అందిస్తున్న వైద్య సేవల వివరాలను గోడపై అతికించాలని సూచించారు.
News November 27, 2025
VZM: డిసెంబర్ 5న డ్రమ్స్ శివమణికి సత్కారం

ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో డిసెంబరు 5న విజయనగరంలో ఘంటసాల జయంత్యుత్సవాలు జరుగుతాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీత డ్రమ్స్ శివమణిని ఆరోజు సత్కరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.భీష్మారావు తెలిపారు. ముందుగా గుమ్చీ కూడలిలోని ఘంటసాల విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం ఆనందగజపతి ఆడిటోరియంలో 12 గంటల స్వరాభిషేకం, సాయంత్రం శివమణి సంగీత కార్యక్రమం చేపట్టనున్నారు.


