News January 29, 2025

HYD: బీఆర్ఎస్‌కు సంఖ్యాబలం లేదు: మేయర్

image

ఫిబ్రవరి 11 వరకు అవిశ్వాస తీర్మానానికి అవకాశం లేదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. కలెక్టర్‌కు నోటీసు ఇవ్వాలన్నా 98 మంది మద్దతు అవసరమని, అంత సంఖ్యాబలం బీఆర్ఎస్‌కు లేదన్నారు. మేయర్, ఉపమేయర్‌పై అవిశ్వాసం పెట్టే హక్కు ప్రతిపక్షాలకు ఉందని.. అయితే వారికి అవిశ్వాసం పెట్టే విధానం తెలియదన్నారు.

Similar News

News February 16, 2025

HYD: హడలెత్తిస్తున్న వరుస హత్యలు

image

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస హత్యలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు హత్యలు జరిగాయి. నేడు పట్టపగలు మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై గూగులోత్ ఉమేశ్ (23)ను వెంబడించి మరీ అతని తమ్ముడు రాకేశ్ మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

News February 16, 2025

HYD: నుమాయిష్‌కు రేపే లాస్ట్

image

HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు పోటెత్తుతున్నారు. రేపు చివరి రోజు కావడంతో నుమాయిష్‌ను సందర్శించేందుకు భారీగా తరలివస్తున్నారు. శనివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు సొసైటీ బుకింగ్ కమిటీ కన్వీనర్ సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్ రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే.

News February 16, 2025

HYDలో ప్రేమికుల రోజు LOVER సూసైడ్

image

హైదరాబాద్‌ పాతబస్తీలో జరిగిన ఓ విషాద గాథ ఆలస్యంగా వెలుగుచూసింది. సంతోష్‌నగర్‌ పోలీసుల వివరాలు.. PSపరిధిలో ఉండే మహ్మద్ ఇమ్రాన్‌, చాంద్రాయణగుట్టకు చెందిన యువతి ప్రేమికులు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసింది. దీంతో ఆమె తండ్రి ఇమ్రాన్‌పై కోపంతో తన కూతురిని వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేయించాడు. ఈ మనస్తాపంతో‌ ప్రియుడు ఉరేసుకున్నాడు. వాలంటైన్‌డే రోజు‌ ఇలా జరగడం స్థానికంగా విషాదం నింపింది.

error: Content is protected !!