News February 19, 2025

HYD: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం

image

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Similar News

News March 28, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 28, 2025

మార్చి 28: చరిత్రలో ఈరోజు

image

1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణం
1904: తెలుగు సినీ నటుడు చిత్తూరు నాగయ్య జననం (ఫొటోలో)
1914: తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు జననం
1944: నేపథ్య గాయని బి.వసంత జననం
1948: సినీ దర్శకుడు ఐ.వి.శశి జననం
1954: నటి మూన్ మూన్ సేన్ జననం
1962: భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు కోరాడ రామకృష్ణయ్య మరణం

News March 28, 2025

బెల్లంపల్లి: రైలు పట్టాలపై వ్యక్తి మృతి

image

బెల్లంపల్లి పట్టణం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే శాఖ హెడ్ కానిస్టేబుల్ సురేశ్ గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం వెళ్లే సింగరేణి ప్యాసింజర్ రైలుకింద పడి మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఎల్లో కలర్ రౌండ్ నెక్ టీ షర్ట్, గ్రీన్ కలర్ షార్ట్ ధరించి ఉన్నట్లు వెల్లడించారు.

error: Content is protected !!