News June 21, 2024

HYD: బీజేపీ రెచ్చగొట్టే ప్రసంగాలు: జగ్గారెడ్డి

image

యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం సరికాదన్నారు. శుక్రవారం ఆయన HYD గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌కు యూపీఏ హయాంలోనే పర్మిషన్లు వచ్చాయన్నారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే, గడిచిన పదేళ్లలో దాదాపు 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు.

Similar News

News November 20, 2025

HYD: ఆందోళన కలిగిస్తున్న రేబిస్ మరణాలు

image

నగరవాసులను రేబీస్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి పరిధిలో రేబీస్‌తో చనిపోయిన వారి సంఖ్య ఈ ఏడాది సెప్టెంబరు వరకు 32కు చేరింది. 2023లో 13, 2024లో 16 మంది మృతి చెందితే ఈఏడాది ఈ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి ఏటా 20వేల మంది కుక్కకాటు బాధితులు వస్తారని సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

News November 20, 2025

HYD: 3వేల మంది అతిథులు.. 2,500 మంది పోలీసులు

image

వచ్చేనెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోని కందుకూర్ మీర్ఖాన్‌పేటలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నారు. ఈ సమ్మిట్‌కు దాదాపు 3వేల మంది వీఐపీలు, వారి అసిస్టెంట్లు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు వెయ్యి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక 2,500 మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు.

News November 20, 2025

షుగర్ కేసులు.. దేశంలోనే హైదరాబాద్ నం.4

image

దేశంలో డయాబెటిస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు అధికంగా ఉన్న నగరాల్లో HYD 4వ స్థానంలో నిలిచింది. జీవనశైలి, ఒత్తిడి, వ్యాయామం తగ్గడం, జంక్‌ఫుడ్, అధికంగా కార్బ్స్ తీసుకోవడం దీనికి ప్రధాన కారణాలని వైద్యులు తెలిపారు. గొంతు తడారడం, తరచూ మూత్ర విసర్జన, శరీర బరువు తగ్గటం, అలసటగా ఉంటే అశ్రద్ధ చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.