News March 31, 2024

HYD: బీసీలకు భిక్షం వద్దు.. హక్కులు కావాలి: R.కృష్ణయ్య

image

లోక్‌సభ ఎన్నికల్లో BRS, కాంగ్రెస్, బీజేపీ.. బీసీలకు జనాభా ప్రాతిపదికన టికెట్లు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్, గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఆదివారం కాచిగూడలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. బీసీలకు భిక్షం వద్దని.. రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలని అన్నారు.

Similar News

News February 1, 2025

HYD: రోల్ మోడల్‌గా తెలంగాణ

image

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సర్వేలో తెలంగాణ అనేక అంశాల్లో ఆదర్శంగా నిలిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి తెలంగాణ ఘనతను చాటింది. అనేక పథకాల అమలు, వినూత్న పథకాల అమలులో ముందుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.

News February 1, 2025

HYD: R&B ఛీప్ ఇంజినీర్లతో మంత్రి కోమటిరెడ్డి నివాసంలో సమావేశం

image

ఆర్ & బీ ఛీఫ్ ఇంజినీర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహించారు. అటవీ అనుమతులతో పెండింగ్‌లో ఉన్న రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. రహదారి, భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, పనుల్లో వేగం పెంచి ప్రగతి చూపిస్తేనే, మరిన్ని నిధులు సాధించవచ్చని అధికారాలకు మంత్రి దిశానిర్ధేశం చేశారు.

News February 1, 2025

HYD: TGSPDCL, TGNPDCLకు రూ.45,698 కోట్ల రాబడి

image

విద్యుత్ భారాలపై తెలంగాణ విద్యుత్ శాఖ తర్జన భర్జన పడుతుంది. గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్‌కు రూ.2,400 కోట్ల భారాలను మోస్తున్న విద్యుత్ శాఖ.. ఆ మేరకు ప్రభుత్వం నుంచి నిధులను సేకరించుకోవాల్సి ఉంది. ప్రస్తుత విద్యుత్ టారీఫ్‌తో ఎస్పీడీసీఎల్ సంస్థకు రూ.36,277 కోట్ల రాబడి వస్తుండగా.. అటు ఎన్పీడీసీఎల్‌కు రూ.9,421 కోట్ల రాబడి వస్తున్నట్లు సమాచారం. ఈ రెండు కలిపితే రూ.45,698 కోట్లు రాబడి వచ్చింది.