News February 25, 2026

HYD: బుక్స్‌ను గౌరవిద్దాం.. పర్యావరణాన్ని కాపాడదాం!

image

పరీక్షలు ముగిసిన తర్వాత పుస్తకాలను చింపి రోడ్లపై వేయకుండా, విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరించాలని HYDలోని విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. పుస్తకాలు జ్ఞానానికి ప్రతీకలని, సరస్వతీ దేవతతో సమామానంగా కొలిచే వాటిని అగౌరపరచొద్దని, అవసరమైనవారికి అందించాలని గుర్తుచేస్తున్నారు. రోడ్లపై పేపర్లు వేస్తే పారిశుద్ధ్య కార్మికులపై భారం పడుతుందని, నగరాన్ని నీట్‌గా ఉంచడంలో అందరూ సహకరించాలన్నారు.

Similar News

News April 18, 2026

పాడేరు: ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గమనిక

image

ఇంటర్ పరీక్ష రాసిన విద్యార్థులు అవసరం అయితే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాలని ఉమ్మడి అల్లూరి జిల్లా ఇంటర్ విద్యాధికారి భీమశంకరరావు శనివారం తెలిపారు. రీ కౌంటింగ్‌కు ఒకొక్క పేపర్‌కు రూ. 260, రీ వెరిఫికేషన్‌కు రూ.1300 చొప్పున చెల్లించాలన్నారు. ఆన్లైన్లో మాత్రమే ఈ నెల 27లోగా అప్లై చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

News April 18, 2026

ములుగు అరణ్యంలో విలసిల్లిన బౌద్ధమతం..!

image

ఎక్కడి కంబోడియా.. ఎక్కడి ములుగు.. అక్కడి అంగ్‌కోర్‌వాట్ ఆలయాన్ని పోలిన ఓ కట్టడం ములుగు మండలం కొత్తూరు దేవునిగుట్టపై ఉంది. 6వ శతాబ్దంలో బౌద్ధ మతంలోని వజ్రాయన సిద్ధాంతాన్ని అనుసరిస్తూ రాతి ఇటుకలతో విష్ణుకుండినులు ఆలయం నిర్మించినట్లు చరిత్రకారులు నిర్ధారించారు. పలువురు విదేశీ పరిశోధకులు అధ్యయనం చేశారు. 1400 ఏళ్ల నాటి ఈ చారిత్రక కట్టడాన్ని సంరక్షించడంలో పురావస్తు శాఖ చొరవ తీసుకోవాల్సి ఉంది.

News April 18, 2026

శకుంతల-దుష్యంతుల ప్రేమ గాథల కుంటాల

image

ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతం పాదాల చెంత గుహలో పురాతన సోమేశ్వర ఆలయం ఉంది. శకుంతల-దుష్యంతుల ప్రేమ గాథకు ఈ ప్రాంతమే సాక్షి అని, అందుకే దీనికి ‘కుంటాల’ అనే పేరు వచ్చిందని స్థానికులు నమ్ముతారు. జలపాతాల హోరు మధ్య స్వయంభువుగా వెలిసిన ఈ శివలింగాన్ని దర్శించుకోవడం ఒక అపురూప అనుభూతి. మహాశివరాత్రి వేళ వేలాది మంది భక్తులు ఈ లోయలోకి దిగి స్వామివారిని దర్శించుకుంటారు.
#నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం