News December 26, 2024
HYD బుక్ ఫెయిర్‌లో డైరెక్టర్ త్రివిక్రమ్

HYD ఎన్టీఆర్ స్టేడియంలో పండుగలా కొనసాగుతున్న పుస్తక ప్రదర్శనకు పుస్తకాభిమానులు తరలివస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పలు స్టాలు పరిశీలించారు. అనంతరం ఆయన రెంటాల జయదేవ రచించిన మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకం గురించి ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా మొదటి రోజుల గురించి రాసిన పరిశోధనాత్మక పుస్తకమని తెలిపారు.
Similar News
News December 27, 2025
HYD: ఆశ్చర్యం.. కంటైనర్‌లో వైన్ షాప్

లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారి పక్కనే కంటైనర్‌లోనే వైన్ షాప్ ప్రారంభం కావడం చర్చనీయాంశంగా మారింది. గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంజూరైన ఓ వైన్ షాప్ రెడీ కాకపోవడంతో దుకాణదారుడు రోడ్డు పక్కనే కంటైనర్ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు ప్రారంభించాడు. ప్రధాన రహదారిపై ఇలా కంటైనర్‌లో వైన్ షాప్ నడపడం చూసిన స్థానికులు, ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
News December 27, 2025
HYD: వీడియో వైరల్ చేస్తామని అమ్మాయికి బెదిరింపులు..!

వాట్సాప్‌లో అనుమానాస్పద లింక్స్ పంపిస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు దిగుతున్నారని అధికారులు హెచ్చరించారు. ఉప్పల్ పరిధిలో ఓ యువతికి లింక్ పంపి వీడియో కాల్ చేసిన తర్వాత వ్యక్తిగత వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. తెలియని లింక్స్, కాల్స్‌కు స్పందించవద్దని, ఓటీపీ, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు.
News December 27, 2025
గ్రేటర్ HYDలో నీటి కష్టాలు

HYDలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జలాల వినియోగం విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉప్పల్‌లో 7.6 మీటర్లు, అమీర్‌పేటలో 10.5, కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 18.7, దారుల్‌షిఫా 7.1, టోలిచౌకి 3.8, రాజేంద్రనగర్ 7.6, శంషాబాద్ 4.6, వికారాబాద్ 4.8 మీటర్ల లోతుకు నీటి మట్టాలు చేరుకున్నట్లు వెల్లడించారు.


