News December 26, 2024

HYD బుక్ ఫెయిర్‌లో డైరెక్టర్ త్రివిక్రమ్

image

HYD ఎన్టీఆర్ స్టేడియంలో పండుగలా కొనసాగుతున్న పుస్తక ప్రదర్శనకు పుస్తకాభిమానులు తరలివస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పలు స్టాలు పరిశీలించారు. అనంతరం ఆయన రెంటాల జయదేవ రచించిన మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకం గురించి ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా మొదటి రోజుల గురించి రాసిన పరిశోధనాత్మక పుస్తకమని తెలిపారు.

Similar News

News January 23, 2025

HYD ఎయిర్‌పోర్ట్‌లో సందర్శకులకు నో ఎంట్రీ

image

గణతంత్ర వేడుకలు సమీపిస్తున్న వేళ అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో సందర్శకులకు నో ఎంట్రీ అని బోర్డ్ పెట్టారు. ఈ నెల 30 వరకు అనుమతి ఇవ్వమన్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో RGIAలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ప్యాసింజర్ వెంట ఒకరు, ఇద్దరు మాత్రమే రావాలని సూచించారు. SHARE IT

News January 23, 2025

సికింద్రాబాద్‌ రైల్వేలో ఉద్యోగాలు

image

SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. RRB గ్రూప్‌ D నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 32,438 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో SCR పరిధిలో 1642 ఖాళీలు ఉన్నాయి. స్పెషల్ క్యాటగిరీలో మరో 710 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌‌ విడుదలైంది. వేతనం రూ. 18000 ఉంటుంది. వయస్సు: 18-36 మధ్య ఉండాలి. నేటి నుంచి ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హత: 10th, ITI ఉత్తీర్ణత.
SHARE IT

News January 23, 2025

HYD: సెక్రటేరియేట్‌కు వెళ్లే టూరిస్టులపై ఆంక్షలు

image

సచివాలయంకు వచ్చే సందర్శకులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇకపై సచివాలయం లోపలకి వెళ్లేవారికి ఇచ్చే పాసుతో ఒక్కరిని మాత్రమే అనుమతినిస్తామని తెలిపింది. సీఎస్ ఫ్లోర్‌లో సందర్శకుల తాకిడి ఎక్కువ కావడంతోపాటు.. సందర్శకుల సంఖ్యను తగ్గించాలని SPF సిబ్బంది కోరడంతో భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.