News March 8, 2025
HYD: బుల్లెట్‌పై 7 దేశాలు చుట్టేసింది!

బైక్ రైడింగ్ అంటే మగవారాకి మాత్రమే అనుకునే ఈ కాలంలో మేము కూడా దేనికి తీసిపోమని నిరుపిస్తున్నారు HYDకు చెందిన జైభారతి. బుల్లెట్ బైక్ వేసుకొని 7 దేశాలు, లక్ష కి.మీ తిరిగొచ్చారు. ఆర్కిటెక్ట్‌గా విధులు నిర్వహిస్తూ బైక్ రైడింగ్ చేస్తున్న జైభారతి 2013లో ‘బైకర్నీ విమెన్ గ్రూప్ HYD చాప్టర్’ ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ అంతా బైకులపై పలు ప్రాంతాలకు వెళ్లేవారు. ఆమె సహసాన్ని ప్రధాని మోదీతో పాటు KCR అభినందించారు.
Similar News
News March 25, 2025
మేడ్చల్: బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని SUICIDE

క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ వ్యక్తి HYDలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మండల పరిధిలోని గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ (29) క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 25, 2025
HYD: ఓయూలో విధించిన ఆంక్షలపై వాయిదా తీర్మానం

ఓయూలో విధించిన ఆంక్షలపై శాసనసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. విద్యార్థుల ర్యాలీలు, ధర్నాల నిషేధంపై చర్చ కోరుతూ పార్టీ సభ్యులు అసెంబ్లీ కార్యదర్శికి వాయిదా తీర్మానం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వాయిదా తీర్మానం అందించారు.
News March 25, 2025
MMTS అత్యాచారయత్నం.. నిందితుడి గుర్తింపు

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్‌గా గుర్తించారు. జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని యువతి గుర్తించింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.