News October 2, 2024
HYD: బైకు దొంగలొస్తున్నారు జాగ్రత్త!

HYDలో బైకులు ఎత్తుకుపోతున్నట్లు నిత్యం కేసులు నమోదవుతున్నాయి. కాగా ఘరానా దొంగలే కాకుండా జల్సాలకు అలవాటు పడ్డ కొందరు యువకులు ఈ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. ఉప్పల్, అంబర్పేట, ఆర్టీసీ క్రాస్రోడ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, అఫ్జల్గంజ్, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, యాచారం, మంచాల ఇళ్ల ముందు బైకులు ఎత్తుకెళ్లి అమ్మేస్తున్నారు. పండగలకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News December 18, 2025
HYDలో Live-in ఫోబియా.. ట్రెండింగ్లో సిట్యుయేషన్ షిప్!

‘సిట్యుయేషన్ షిప్’.. ప్రేమ వద్దు, పెళ్లి అంతకన్నా వద్దు. కేవలం తోడు కోసం సాగే తాత్కాలిక బంధం ఇది. సిటీలోని అన్ని ప్రాంతాల్లో యువతలో ‘కమిట్మెంట్’ పట్ల భయం పెరిగిపోతుండటంతో ఈ ధోరణి బలపడుతోంది. భావోద్వేగాలను పంచుకుంటారు కానీ.. భవిష్యత్తులో ఉండరు. ఈ బంధాలు చివరకు తీవ్రమైన అభద్రతాభావాన్ని, మానసిక ఒత్తిడిని మిగిలిస్తున్నాయి. ఇలా సంప్రదాయ కుటుంబ వ్యవస్థ బీటలు వారుతోంది. దీనిపై మీ కామెంట్?
News December 18, 2025
గండిపేట నీరు సురక్షితం.. వదంతులు నమ్మొద్దు: జలమండలి క్లారిటీ!

గండిపేటలో మురుగునీరు కలిసినట్లు వస్తున్న వార్తలను జలమండలి MD అశోక్ రెడ్డి ఖండించారు. వ్యర్థాలను పారబోసేందుకు యత్నించిన ప్రైవేట్ ట్యాంకర్ను ముందే గుర్తించి అడ్డుకున్నారని, రిజర్వాయర్ కలుషితం కాలేదని స్పష్టం చేశారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, IS ప్రమాణాలతో ‘మూడంచెల క్లోరినేషన్’ పద్ధతిలో నీటిని శుద్ధి చేస్తున్నట్లు వివరించారు.
News December 18, 2025
HYD: ‘మహా ప్రస్థానం’ తెలుగు కవిత్వ దిశను మార్చింది

<<18569096>>శ్రీశ్రీ<<>> రచించిన ‘మహా ప్రస్థానం’ తెలుగు కవిత్వ దిశనే మార్చిన సంచలన కవితా సంకలనం. కార్మిక, కర్షక, శ్రామిక వర్గాల ఆవేదన, ఆకలి, నిరుద్యోగంపై గర్జించే పద్యాలు ఇందులో అగ్నిజ్వాలలుగా నిలుస్తాయి. 1930లో సామాజిక కల్లోలమే ఈ కవితలకు ప్రాణం. అలంకార కవిత్వాన్ని తోసిపుచ్చి, అభ్యుదయ కవిత్వానికి బాట వేసిన గ్రంథమిది. ‘మహా ప్రస్థానానికి ముందు- తర్వాత’ అనే విభజనకు కారణమైన ఈ సంపుటి, తెలుగు సాహిత్యంలో ఓ మైలురాయి.


