News March 21, 2024
HYD: బొంతుకు NO.. దానంకు YES

కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌కు అధిష్ఠానం టికెట్ ప్రకటించింది. ఇటీవల BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. ఒక దశలో ఆయనకే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం సైతం జరిగింది. ఆయన అనుచరులు ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. కానీ అధిష్ఠానం మాత్రం టికెట్‌ను దానం నాగేందర్‌కు కేటాయించింది.
Similar News
News April 20, 2025
HYD: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 16,305 మంది విద్యార్థులు 73 కేంద్రాల్లో పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీసులను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News April 20, 2025
HYD: ఫ్యాన్సీ నంబర్స్ వేలం ద్వారా భారీ ఆదాయం

ఫ్యాన్సీ నంబర్స్ వేలం ద్వారా తెలంగాణ రవాణాశాఖ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. శనివారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఒక్క రోజులోనే రూ.3.71 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మొత్తం 50కు పైగా ఫ్యాన్సీ నంబర్లు వేలంలో అమ్మకమయ్యాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా 9999, 0001, 6666, 7777 వంటి నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉందని తెలిపారు.
News April 20, 2025
HYD: పీహెచ్డీ కోర్సు వర్క్ పరీక్ష తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ప్రీ పీహెచ్డీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్ సైట్‌లో చూసుకోవాలని సూచించారు.