News September 27, 2024

HYD: బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్..!

image

తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ.. బతుకమ్మ పండుగకు ముందు 9, 5, 3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్‌.. బిడ్డాలెందరూ కోల్‌’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ ప్రాంతంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.

Similar News

News October 7, 2024

HYD: ఈనెల 14 నుంచి 19 వరకు కౌన్సెలింగ్

image

వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన అనుబంధ యూజీ కోర్సులకు ఈనెల 14 నుంచి 19 వరకు HYD రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రఘురామిరెడ్డి తెలిపారు. ప్రతీ రోజు ఉ.9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. కౌన్సెలింగ్ షెడ్యూల్, ఇతర వివరాల కోసం అభ్యర్థులు www.pjtsau.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.

News October 7, 2024

HYD: జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్..!

image

HYD ఎల్బీ స్టేడియంలో ఈనెల 9వ తేదీన నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందిస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. 9న సా.4 గంటలకు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత కార్యదర్శులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. 11 వేలకు పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలు అందించనున్నట్లు తెలిపారు.

News October 7, 2024

HYDలో నమోదైన వర్షపాతం వివరాలు

image

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం కురిసింది. మల్కాజిగిరిలో అత్యధికంగా 4.45 సెం.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మారేడ్‌పల్లిలో 2.85, సీతాఫల్‌మండిలో 2.43, కూకట్‌పల్లిలో 1.60, ఉప్పల్ 1.35 సెంటీమీటర్ల వర్షం పడింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరో 2 రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.