News June 20, 2024
HYD బోనాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గోల్కొండ, సికింద్రాబాద్, లాల్‌దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గురువారం కలిశారు. ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించారు. ఆలయ అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర నాయకులు ఉన్నారు. ఈ ఏడాది జులై 7 నుంచి ఆగస్టు 4 వరకు భాగ్యనగరంలో భోనాలు జరగనున్నాయి.
Similar News
News December 9, 2025
HYD: GHMCలో 300 వార్డులు.. మీకు అబ్జెక్షన్ ఉంటే చెప్పండి.!

గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) పరిధిని 300 ఎన్నికల వార్డులుగా విభజిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ల నిబంధనలు, 1996 ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. వార్డుల సరిహద్దుల వివరాలు www.ghmc.gov.in వెబ్‌సైట్‌తో పాటు అన్ని కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి 7రోజుల్లోపు అభ్యంతరాలు, సూచనలు దాఖలు చేయాలని కమిషనర్ కోరారు.
News December 9, 2025
HYD వాసులకు హెచ్చరిక.. డేంజర్లో పడుతున్నారు!

HYD వాసులకు హెచ్చరిక. సైబర్ మోసగాళ్ల కొత్త స్కామ్ బయటపడింది. APK యాప్‌ల ద్వారా అధిక వడ్డీ పేరిట వల వేస్తూ సైబర్ నేరాల నుంచి వచ్చిన డబ్బునే యాప్ యూజర్ల ఖాతాల్లోకి పంపుతున్నట్లు CCS పోలీసులు గుర్తించారు. రూ.40 వేలు పెట్టిన యూజర్లకు డబుల్ అమౌంట్ బదిలీ అయ్యింది. చివరకు అది సైబర్ క్రైమ్ మనీ అని తేలింది. ఇల్లీగల్ యాప్‌లు, APK ఫైల్స్ ఇన్స్టాల్ చేస్తే మీరు కూడా నేరంలో భాగం అవుతారు. జాగ్రత్త.
SHARE IT
News December 9, 2025
హైదరాబాద్‌లో కొత్త ట్రెండ్

హైదరాబాద్‌లోనూ ప్రస్తుతం ‘భజన్ క్లబ్బింగ్’ జోరుగా సాగుతోంది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ నైట్స్ స్థానంలో యువత ఎంచుకుంటున్న కొత్త ట్రెండ్ ఇది. ’మీనింగ్‌ఫుల్ పార్టీ’ అంటే ఇదే అంటున్నారు. ఆల్కహాల్ తీసుకోకుండా హై-ఎనర్జీ కీర్తనలు, భజన్ జామింగ్ సెషన్స్ లాంటి భక్తి పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. డిస్కో లైటింగ్, DJ నడుమ గ్రూప్ సింగింగ్‌తో మైమరిచిపోతున్నారు. ఈ ట్రెండ్‌పై మీ అభిప్రాయం ఏంటి?


