News June 20, 2024
HYD బోనాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గోల్కొండ, సికింద్రాబాద్, లాల్‌దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గురువారం కలిశారు. ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించారు. ఆలయ అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర నాయకులు ఉన్నారు. ఈ ఏడాది జులై 7 నుంచి ఆగస్టు 4 వరకు భాగ్యనగరంలో భోనాలు జరగనున్నాయి.
Similar News
News November 30, 2025
రంగారెడ్డి జిల్లాలో సర్పంచ్‌లకు 929 నామినేషన్లు

తొలి విడత పంచాయతీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిసింది. ఆదివారం నుంచి రెండో విడత మొదలుకానుంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా రెండు డివిజన్లు, ఏడు మండలాల పరిధిలోని 174 సర్పంచ్ స్థానాలు, 1,530 వార్డులకు నామినేషన్లను ఆహ్వానించగా.. సర్పంచ్‌కు 929 నామినేషన్లు, వార్డులకు 3,327 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, డిసెంబర్ మూడో తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణ కొనసాగనుంది.
News November 30, 2025
చేవెళ్ల, కందుకూరులో నేటి నుంచి రెండో విడత నామినేషన్లు

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, కందుకూరు రెవెన్యూ డివిజన్లలోని 7 మండలాల్లో ఆదివారం నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శంకర్పల్లి, చేవెళ్ల, ఆమనగల్లు సహా 7 మండలాల్లోని 178 పంచాయతీ, 1,540 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 2 తుది గడువు. ఉపసంహరణ 6న కాగా, పోలింగ్, కౌంటింగ్ 14న జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
News November 30, 2025
రంగారెడ్డి జిల్లాలో ప్రజావాణి రద్దు

రంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ C.నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందన్నారు. జిల్లా ప్రజలు, పిర్యాదుదారులు సహకరించాలని కలెక్టర్ కోరారు.


