News June 20, 2024
HYD బోనాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గోల్కొండ, సికింద్రాబాద్, లాల్‌దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గురువారం కలిశారు. ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించారు. ఆలయ అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర నాయకులు ఉన్నారు. ఈ ఏడాది జులై 7 నుంచి ఆగస్టు 4 వరకు భాగ్యనగరంలో భోనాలు జరగనున్నాయి.
Similar News
News September 15, 2024
HYD: శంషాబాద్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్
HYD శివారు శంషాబాద్ ప్రాంతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. RGIA సమీపాన దాదాపుగా 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ దశల్లో దీనిని నిర్మించనున్నారు. ఇప్పటికే ఓ ఆఫీస్ టవర్ నిర్మాణం ప్రారంభం కాగా.. 2025-26 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా ఇంజినీరింగ్ బృందం కసరత్తు చేస్తోంది. మరోవైపు నగరంలో AI సిటీ సైతం నిర్మిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
News September 14, 2024
HYD: రెచ్చగొట్టే వారిని అణచివేయండి: మంత్రి
ఐక్యతకు హైదరాబాద్ ప్రతీకగా నిలిచిందని, అలజడలు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వర్గ విభేదాలు సృష్టిస్తూ సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు.
News September 14, 2024
నిమ్స్‌లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు
నిమ్స్‌లో ఈ నెల 22 నుంచి 28 వరకు యూకే వైద్యుల బృందం ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ సంచాలకుడు బీరప్ప శనివారం తెలిపారు. గుండెకు రంధ్రం ఇతర సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు వైద్య సేవలు అందించనున్నారు. వివరాలకు నిమ్స్‌లోని కార్డియో వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.