News July 3, 2024
HYD: బోనాల చెక్కుల పంపిణీకి సిద్ధం: కలెక్టర్

ఆషాఢ మాస బోనాల జాతర ఉత్సవాలకు సంబంధించి వివిధ శాఖల అధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లు పూర్తి కానున్నాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బోనాల పండగ నేపథ్యంలో ఆలయాలకు ఇవ్వాల్సిన చెక్కులు పంపిణీకి సిద్ధమయ్యాయని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో వాటిని పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 7న జగదాంబ మహంకాళి గోల్కొండ, లంగర్ హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపును మంత్రులు ప్రారంభిస్తారని చెప్పారు.
Similar News
News November 9, 2025
జూబ్లీ బైపోల్: అసలు అభ్యర్థులేమైనా మాట్లాడారా?

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో 3 ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులతో రోడ్షోలు నిర్వహించాయి. అంతటితో ఆగకుండా పార్టీ పెద్దలు వారి విజయం కోసం ప్రచారం చేశారు. అసలు విషయం ఏంటంటే ఈ పార్టీల అభ్యర్థులు ఓటర్లకేమైనా హామీలిచ్చారా? అసలు వీరిని బడా నాయకులు మాట్లాడనిచ్చారా? అని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతా మీరే చేస్తే.. ఇక అభ్యర్థులెందుకు.. మీరే పోటీచేయొచ్చు కదా అని విమర్శిస్తున్నారు.
News November 9, 2025
నవీన్ యాదవ్ రౌడీ కాదు: CM రేవంత్

నవీన్ యాదవ్ రౌడీ కాదని CM రేవంత్ రెడ్డి అన్నారు. B.Arch చేసి, ప్రజా సేవలో ఉన్న యువకుడు నవీన్ అంటూ CM పేర్కొన్నారు. ‘తన తండ్రిని చూసి రౌడీ అన్ని ముద్ర వేస్తున్నట్లు నవీన్ యాదవ్ ఇప్పటికే చెప్పారు. పాస్పోర్టు బ్రోకర్ కొడుకు ఏం అవుతారని కూడా ఆయన నిలదీశారు. దీనిపై BRS సమాధానం చెప్పాలి. టికెట్ ఇచ్చిన అని నేను ఏం చెప్పడం లేదు. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ప్రజలే తీర్పు చెబుతారు’ అని CM రేవంత్ తెలిపారు.
News November 9, 2025
HYD: తండ్రి మరణం తట్టుకోలేక యువతి సూసైడ్

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక సౌమ్య అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.బ్లాక్ నంబర్–4 అపార్ట్మెంట్స్లోని మూడో అంతస్తు నుంచి దూకిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు నిలువలేదు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


