News July 28, 2024
HYD: బోనాల పండుగకు డాన్స్ చేసేవాణ్ని: హీరో

HYD పాతబస్తీలో చిన్నప్పటి నుంచి లాల్ దర్వాజా బోనాలు చూస్తూ పెరిగానని హీరో ప్రియదర్శి అన్నారు. పోతరాజు వేషంలో డాన్స్ చేసేవాళ్లని చూస్తుంటే సంతోషంగా ఉంటుందన్నారు. డ్రమ్స్, మ్యూజిక్, డాన్స్ చూస్తుంటే బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుందన్నారు. తన బాల్యంలో బోనాల పండుగకు డాన్స్ చేసేవాణ్ని అని చెప్పారు. HYD బోనాల పండుగను తిలకిస్తుంటే చెప్పలేని సంతోషం కలుగుతుందన్నారు.
Similar News
News November 16, 2025
ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు RTA స్ట్రాంగ్ వార్నింగ్

చేవెళ్ల బస్సు ప్రమాదం తరువాత RTA అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ప్రైవేటు వాహనాలను తనిఖీ చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రమేశ్ ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు వార్నింగ్ ఇచ్చారు. ప్రయాణికుల లగేజీ కాకుండా ఇతర లగేజీ తీసుకువెళితే చర్యలు తీసుకుంటామన్నారు. 30 ప్రాంతాల్లో 24 గంటలపాటు ప్రత్యేక సిబ్బంది బస్సులను తనిఖీ చేస్తున్నారన్నారు.
News November 16, 2025
HYD: బిర్సా ముండా జయంతి సందర్భంగా ర్యాలీ

భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సావిత్రితో కలిసి ట్యాంక్ బండ్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివేకానంద విగ్రహం నుంచి కొమురం భీమ్ విగ్రహం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల కోసం భగవాన్ బిర్సా ముండా చూపిన ధైర్యం ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు.
News November 16, 2025
HYD: బంధాన్ని నిలుపుకో.. వదులుకోకు..!

HYDలో మనువు మున్నాళ్ల ముచ్చటగా మారుతున్న పరిస్థితి కలవరపెడుతోంది. ఈగో, విలువలు తగ్గటం, వివాహేతర సంబంధాలు, అభద్రతా భావం, తొందరపాటు నిర్ణయాలు, కొత్తకల్చర్ వంటి వాటితో కోర్టు మెట్లెక్కుతున్నట్లు ఏటా నమోదవుతున్న కేసులు చెబుతున్నాయి. ఇందులో 25- 35 ఏళ్ల జంటలు 75% ఉన్నాయి. న్యాయస్థానాల్లో ప్రతినెలా 250 కేసులు నమోదవుతున్నాయి. బంధాన్ని బలపర్చుకోవడానికి ఆలోచించాలి కానీ బలహీనపరుచుకోవడానికి కాదని పెద్దల మాట.


