News July 31, 2024
HYD: బ్యాంకులో భారీ స్కామ్.. మేనేజర్ ARREST

శంషాబాద్ ఇండస్ఇండ్ బ్యాంక్లో రూ.40 కోట్ల స్కామ్ జరిగిన విషయం తెలిసిందే! ఈ భారీ స్కామ్లో బ్యాంక్ మేనేజర్ రామస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో బ్యాంకు ఉద్యోగి రాజేశ్తో కలిసి రూ.40 కోట్లు స్వాహా చేశారు. సినీ నిర్మాత షేక్ బషీద్కు మేనేజర్ రూ.40కోట్లు బదిలీ చేశాడు. అక్కడినుంచి మరికొన్ని అకౌంట్లకు సొమ్ము ట్రాన్స్ఫర్ అయినట్లు తేలింది.
Similar News
News October 17, 2025
HYD: నిమ్స్లో అనస్థీషియా విద్యార్థి అనుమానాస్పద మృతి

పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి నితిన్ అనుమానాస్పద మృతి చెందాడు. నిన్న రాత్రి విధులకు హాజరుకాగా.. ఇవాళ ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నాడు. ఆస్పత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతి పట్ల పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.
News October 17, 2025
HYD: ఖజానా నింపేందుకు ప్రభుత్వ భూమి ఈ వేలం

రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో 4,718.22 చదరపు అడుగుల ప్రభుత్వ స్థలం ఉంది. దానిని వేలం వేయాలని సర్కారు నిర్ణయించింది. కనీస ధర (గజం) రూ.3.10 లక్షలుగా నిర్ణయించింది. వచ్చేనెల 10న E-వేలం నిర్వహించేందుకు టీజీఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజు మ. 3 నుంచి E-వేలం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఈ నెల 22న ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహించనున్నారు.
News October 17, 2025
మెట్రో స్వాధీనంపై కమిటీ.. ఛైర్మన్గా TG సీఎస్

హైదరాబాద్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోబోతోంది. ఈ ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. చీఫ్ సెక్రెటరీ ఛైర్మన్గా కమిటీని ఏర్పాటుచేసి నివేదిక కోరనుంది. మెట్రోపై పూర్తిగా అధ్యయనం చేయాలని ఆదేశించనుంది. కమిటీలో మెట్రో రైల్ ఎండీ, ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ, ఎంఏయూడీ సెక్రెటరీ, లా సెక్రెటరీ మెంబర్లుగా ఉంటారు.