News June 11, 2024
HYD: బ్యాంక్ ఆఫ్ బరోడాతో తెలంగాణ అగ్నిమాపక శాఖ ఒప్పందం

బ్యాంక్ ఆఫ్ బరోడాతో తెలంగాణ అగ్నిమాపక శాఖ వేతనాలు, పెన్షన్లు, ప్రమాద బీమా వంటి అంశాలపై అవగాహన ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర పోలీసులకు ఇస్తున్న కవరేజీ, సేవలు, ప్రత్యేక ఆఫర్లను అగ్నిమాపకశాఖ సిబ్బందికి కూడా అందించనున్నారు. ఈ మేరక అగ్నిమాపక సేవల శాఖ డీజీ వై.నాగిరెడ్డి, బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ రితేశ్ కుమార్ సోమవారం ఎంవోయూపై సంతకాలు చేశారు.
Similar News
News March 26, 2025
చేనేత కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఇందిర తెలిపారు. ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7- 2025 సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులను ప్రదానం చేయడానికి అర్హతలతో దరఖాస్తులు కోరుతోందిని వివరించారు. ఏప్రిల్ 15లోపు చేనేత నుంచి HYDలోని చేనేత జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
News March 26, 2025
HYD: అమ్మానాన్న సారీ.. స్టేటస్ పెట్టి SUICIDE

మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో సోమేశ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సోదరి వివాహం కోసం దాచిన డబ్బులతో పాటు సోమవారం జరిగిన IPLలో ఒక్కరోజే లక్ష పోగొట్టుకున్నాడు. దీంతో అతడు.. ‘నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడయ్యా. డబ్బుల విషయంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదు. నా మైండ్ సెట్ కంట్రోల్ కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అమ్మానాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సారీ’ అని స్టేటస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.
News March 26, 2025
గ్రేటర్‌లో స్ట్రీట్ లైట్లకు త్వరలో యాప్

గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొందన్న ఫిర్యాదులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. వీటి మెరుగైన నిర్వహణకు సాంకేతికత వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కమిషనర్ ఇలంబర్తి తెలిపారు.