News January 29, 2025

HYD బ్రాండ్ ఇమేజ్ పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

image

HYD, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దావోస్ పెట్టుబడులపై ఆయన మంగళవారం వివరాలు వెల్లడించారు. మూసీ నది ప్రక్షాళన, నిరుద్యోగ యువతి యువకుల నైపుణ్యం పెంచేలా సింగపూర్‌లో CM చర్చలు జరిపారన్నారు. HYD ప్రజలకు మెరుగైన జీవనం కల్పించేలా ప్రస్తావించామన్నారు. సింగపూర్ మంత్రులు దీనిపై ఆసక్తి చూపించారన్నారు. యువత భవిష్యత్తు కోసమే యంగ్ ఇండియా యూనివర్సిటీ తీసుకొచ్చామన్నారు.

Similar News

News November 21, 2025

NRPT: స్థానిక ఎన్నికలపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

image

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పోలింగ్‌ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎస్పీ వినీత్‌తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

News November 21, 2025

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2,803 మందికి లబ్ధి

image

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల రూ.లక్ష లోపు రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2,803 మంది చేనేత కార్మికులకు రూ.23.25 కోట్ల రుణమాఫీ కానుంది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల పరిధిలో ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2024 మధ్య తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

News November 21, 2025

కొత్త టీచర్లకు సెలవులు ఇలా..

image

AP: మెగా డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన కొత్త టీచర్లకు సెలవులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 3న వీరు విధుల్లో చేరగా డిసెంబర్ వరకు వర్తించే ప్రపోర్షనేట్ సెలవులను వెల్లడించింది. 4 CL(క్యాజువల్ లీవ్), 1 OH(ఆప్షనల్ హాలిడే), 2 SPL CL(స్పెషల్ క్యాజువల్ లీవ్), మహిళలు అదనంగా ఒక స్పెషల్ CL వినియోగించుకోవచ్చని తెలిపింది. మెగా డీఎస్సీ ద్వారా 15,941 మంది ఎంపికైన విషయం తెలిసిందే.