News January 29, 2025
HYD బ్రాండ్ ఇమేజ్ పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

HYD, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దావోస్ పెట్టుబడులపై ఆయన మంగళవారం వివరాలు వెల్లడించారు. మూసీ నది ప్రక్షాళన, నిరుద్యోగ యువతి యువకుల నైపుణ్యం పెంచేలా సింగపూర్‌లో CM చర్చలు జరిపారన్నారు. HYD ప్రజలకు మెరుగైన జీవనం కల్పించేలా ప్రస్తావించామన్నారు. సింగపూర్ మంత్రులు దీనిపై ఆసక్తి చూపించారన్నారు. యువత భవిష్యత్తు కోసమే యంగ్ ఇండియా యూనివర్సిటీ తీసుకొచ్చామన్నారు.
Similar News
News February 7, 2025
గొల్లప్రోలు: పవన్ చొరవ.. ఆ గ్రామస్థుల కల నెరవేరింది

గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేట గ్రామస్థుల కల నెరవేరింది. గొల్లప్రోలు, తాటిపర్తి గ్రామాల నుంచి చిన్న జగ్గంపేట గ్రామానికి వెళ్లే రోడ్డు గోతులమయంగా మారడంతో రాత్రి సమయంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలు గురయ్యేవారు. ఆ గ్రామస్థులు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేదు. దీంతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో ఆ గ్రామస్థుల ఇబ్బందులు తొలిగాయి.
News February 7, 2025
సీఎం రేవంత్‌పై WEF ప్రశంసల జల్లు

TG: CM రేవంత్ రెడ్డిపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF) ప్రశంసలు కురిపించింది. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి విషయంలో ఆయన దార్శనికత అద్భుతమని పేర్కొంటూ ఓ లేఖ రాసింది. ‘రాష్ట్ర అభివృద్ధికోసం మీ ప్రణాళికలు బాగున్నాయి. దావోస్ సదస్సులో మీరు కీలక భాగస్వామిగా వ్యవహరించారు. రైజింగ్ తెలంగాణ 2050 నినాదం ప్రత్యేకంగా నిలిచింది. 2047 కల్లా హైదరాబాద్‌ను కాలుష్యంలో నెట్ జీరో చేయాలన్న మీ సంకల్పం ప్రశంసనీయం’ అని కొనియాడింది.
News February 7, 2025
VZM: మన మంత్రికి మీరిచ్చే ర్యాంక్ ఎంత?

అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి గజపతినగరం MLAగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ చంద్రబాబు క్యాబినేట్‌లో MSME., సెర్ప్, NRI సాధికారత, సంబంధాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే 25 మంది మంత్రుల పనితీరుపై ర్యాంకులు కేటాయించగా కొండపల్లి మూడో ర్యాంకు సాధించారు. ఉత్తరాంధ్రలో సీనియర్లు అయిన అచ్చెన్నకు 17, అనితకు 20, సంధ్యారాణికి 19 ర్యాంక్ ఇచ్చారు. మరి కొండపల్లి పనితీరుకు మీరెచ్చే ర్యాంకు ఎంత?