News January 29, 2025

HYD బ్రాండ్ ఇమేజ్ పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

image

HYD, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దావోస్ పెట్టుబడులపై ఆయన మంగళవారం వివరాలు వెల్లడించారు. మూసీ నది ప్రక్షాళన, నిరుద్యోగ యువతి యువకుల నైపుణ్యం పెంచేలా సింగపూర్‌లో CM చర్చలు జరిపారన్నారు. HYD ప్రజలకు మెరుగైన జీవనం కల్పించేలా ప్రస్తావించామన్నారు. సింగపూర్ మంత్రులు దీనిపై ఆసక్తి చూపించారన్నారు. యువత భవిష్యత్తు కోసమే యంగ్ ఇండియా యూనివర్సిటీ తీసుకొచ్చామన్నారు.

Similar News

News February 9, 2025

సికింద్రాబాద్: షాపింగ్‌ మాల్‌లో సూసైడ్ అటెంప్ట్!

image

సికింద్రాబాద్‌లో ఆదివారం దారుణం జరిగింది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఓ షాపింగ్‌ మాల్‌లో భార్య మౌనిక పని చేస్తుండగా ఆమెతో గొడవ పడి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో కస్టమర్లు ఉండగానే ఘటన జరగడంతో అందరూ పరుగులు తీశారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

News February 9, 2025

ఉప్పల్ MLA ఇంట్లో విషాదం

image

ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు బండారి వెంకట్ రెడ్డి సతీమణి పద్మ సాయంత్రం కన్నుమూశారు. రేపు కీసర మండలం చీర్యాల వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర సైనిక్‌పురి నుంచి మొదలవనుంది. ఫిబ్రవరి 15న MLA లక్ష్మారెడ్డి కూతురు వివాహం ఉండడం, ఇంతలోనే ఆయన వదిన మృతి చెందడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

News February 9, 2025

HYD: చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టర్ (PHOTO)

image

తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణాలు పోసింది ఓ డాక్టర్. నార్సింగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యశ్వంత్ అనే వ్యక్తి చనిపోయాడు. ఇదే యాక్సిడెంట్‌లో డా. నంగి భూమిక(24) తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో జీవన్‌దాన్‌ బృందం ఐదుగురు పేషంట్లకు ఆర్గాన్లు అవసరమని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. భూమిక గుండె, లీవర్, కళ్లు, కిడ్నీలను దానం చేసి ఐదుగురికి ప్రాణం పోశారు.

error: Content is protected !!