News January 17, 2025
HYD: బ్రిజేష్ ట్రిబ్యునల్‌ను ప్రభుత్వం స్వాగతిస్తోంది: మంత్రి

బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. తెలంగాణకు సరైన న్యాయం జరిగేందుకు ఈ తీర్పు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. బచావత్ ట్రైబ్యునల్ ఎన్.బ్లాక్‌గా కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కనుందని తెలిపారు.
Similar News
News February 19, 2025
శివాజీ జయంతి: హోరెత్తనున్న హైదరాబాద్

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జయంతి నేడు. ఈ సందర్భంగా ఉత్సవాలకు హైదరాబాద్ ముస్తాబైంది. హిమాయత్‌నగర్, గోషామహల్, రాంనగర్, అంబర్‌పేట, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నంలో హిందూ ఏక్తా ర్యాలీలు నిర్వహించనున్నారు. శివాజీ మహారాజ్ భారీ విగ్రహాలను సిటీలో ఊరేగిస్తారు. జై భవాని.. జై శివాజీ నినాదాలతో నేడు భాగ్యనగరం హోరెత్తనుంది.
News February 19, 2025
HYD: మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళా కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. భక్తుల సౌకర్యార్థం ఈ రైళ్లను ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్, రక్సౌల్‌కు ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ రైళ్లు ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు అందుబాటులో ఉంటాయి. రైళ్ల రాకపోకల వివరాలు.. తేదీల కోసం పైన పేర్కొన్న పట్టికను చూడండి. ఈ రైళ్ల రాకపోకల సమాచారం కోసం SCR వెబ్‌సైట్ చూడొచ్చు.
News February 19, 2025
HYD:”17 మంది నిందితులకు జీవితఖైదు”

నల్గొండ జిల్లా SC, ST స్పెషల్ సెషన్స్ కోర్టు అడ్డగూడూర్ పరిధిలో 2017లో జరిగిన హత్య కేసులో 17 మంది నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించింది. పాత కక్షల కారణంగా అజీంపేట(V)కి చెందిన బట్ట లింగయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. రాచకొండ పోలీసులు వేగంగా విచారణ జరిపి, పక్కా సాక్ష్యాలను సమర్పించడంతో నిందితులకు కఠిన శిక్ష పడింది.