News April 19, 2024
HYD: బ్లాక్లో ఐపీఎల్ టికెట్లు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల అరెస్ట్

బ్లాక్లో IPL టికెట్లను అమ్ముతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులను సైబరాబాద్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ ప్రాంతంలో ఐపీఎల్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నారన్న సమాచారంతో ముగ్గురు యువకులను పట్టుకుని వారి నుంచి 15 ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సన్ రైజర్స్ V/s రాయల్ ఛాలెంజర్ టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో టికెట్ రూ.10వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 26, 2025
నెత్తురోడుతున్న ‘సికింద్రాబాద్’ రైల్వే పట్టాలు

సికింద్రాబాద్ పరిధిలో రైల్వే పట్టాలు నెత్తురోడుతున్నాయి. SEC రైల్వే పోలీస్ జిల్లా పరిధిలో 2025లో OCT 20 నాటికి సుమారు 500 ప్రమాదాలు జరగగా, 400 వరకు ఆత్మహత్యలు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని, ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలకు శోకం మిగల్చొద్దని RPF టీం సూచించింది.
News October 25, 2025
కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్పై BRS ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హీటెక్కింది. బీఆర్ఎస్ నాయకులపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ దుష్ప్రచారం చేసిందని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఫేక్ పోస్టులు, తప్పుదారి పట్టించే వీడియోలు, ఎడిట్ చేసిన ఫొటోలతో తమ మీద బురద జల్లుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి ఫేక్ పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News October 25, 2025
మంత్రి పొన్నం రాజీనామా చేయాలని AAP డిమాండ్

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని AAP తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డా.దిడ్డి సుధాకర్ ఆరోపించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం లిబర్టీలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మృతులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.


