News June 28, 2024

HYD: బ్లాస్ట్.. చెల్లాచెదురుగా మృతదేహాలు, కాళ్లు, చేతులు..!

image

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధి బూర్గులలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో బ్లాస్ట్ జరిగి ఆరుగురు మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. కాగా ఒక్కసారిగా కంప్రెషర్ గ్యాస్ పేలడంతో కార్మికులు ఎగిరిపడ్డారు. మృతదేహాలు, మాంసపు ముద్దలు, కార్మికుల అవయవాలు, కాళ్లు, చేతులు పరిశ్రమలో చెల్లాచెదురుగా పడిపోయాయి. అక్కడి పరిస్థితిని చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. శంషాబాద్ DCP రాజేశ్ పరిశీలించారు.

Similar News

News November 19, 2025

HYD: ‘చెరి సగం ఖర్చు భరించి మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం’

image

HYD నగరంలో నిర్మించనున్న 160 KM మెట్రో రైల్ లైన్‌ను చెరి సగం ఖర్చుతో పూర్తి చేస్తామని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. ఎల్ అండ్ టీ ఆధీనంలోని మెట్రోను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత జరిగే మెట్రో నిర్మాణంలో రాష్ట్రంతో కేంద్రం పార్టనర్‌షిప్ కుదుర్చుకుంటుందన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు కేంద్రం తన నిర్ణయం చెబుతుందని నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు.

News November 19, 2025

GHMC ఎన్నికలకు సిద్ధం కావాలి: KTR

image

ఓడిన చోటే గెలిచి చూపిద్దామని, GHMC ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సూచించారు. బుధవారం HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నేతలతో సమావేశం అయ్యారు. సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దొంగ ఓట్లు, అక్రమాలతోనే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు.

News November 19, 2025

రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

image

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్‌ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్‌కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.