News May 21, 2024
HYD: భర్తను వేధిస్తున్న భార్యపై కేసు నమోదు

భర్తను వేధిస్తూ టార్చర్ చేస్తున్న భార్యపై కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు.. APఅమలాపురం వాసి టెమూజియన్ కుముజకు రాజోలు వాసి లక్ష్మీగౌతమితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారు HYDఅల్వాల్‌లో వచ్చి ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు. భర్త మల్లారెడ్డి కాలేజీలో సహాయ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అత్తింటి ఆస్తుల కోసం ఆమె.. భర్త, అత్తమామలను వేధిస్తోంది. కత్తితో భర్తపై దాడి చేయగా కేసు నమోదైంది.
Similar News
News November 16, 2025
రంగారెడ్డి జిల్లాలో 2 కోట్ల చేపపిల్లల లక్ష్యం

రంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు వెయ్యికిపైగా ఉన్నాయి. వాటిలో 2 కోట్లకుపైగా చేప పిల్లలు అవసరం ఉండగా.. 59 లక్షలు మాత్రమే వచ్చాయి. అయితే జిల్లాలో సుమారు 15వేల మంది చేపలు పట్టడం, వాటిని విక్రయించడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మిగతా వాటిని కూడా పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. కాగా, మరిన్ని చేప పిల్లల కోసం ప్రతిపాదనలు పంపించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి పూర్ణిమ తెలిపారు.
News November 15, 2025
రంగారెడ్డి: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు జీ.ఆశన్న సూచించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు 2025-26 సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలనన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు.
News November 12, 2025
FLASH: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈరోజు అధికారులు డ్రగ్స్ పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడు సలీంను (DRI) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతడి బ్యాగులో 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, సలీంను అదుపులోకి తీసుకున్న అధికారులు, నిషేధిత వస్తువులను సీజ్ చేశారు.


