News January 29, 2025
HYD: భారత్ మహిళా కెప్టెన్‌గా చూస్తామని ఆశిస్తున్నా: కేటీఆర్

అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి మహిళగా తెలంగాణ అమ్మాయి త్రిష గొంగిడి రికార్డు సృష్టించడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో అద్భుతమైన ఫీట్ సాధించిందని కొనియాడారు. దేశ గౌరవాన్ని పెంచడంతో పాటు.. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో మార్మోగేలా చేశావని ప్రశంసించారు.
Similar News
News December 11, 2025
HYD: పల్లె పోరుకు ‘పట్నం’ వదిలి!

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడత పోలింగ్ జరగనుంది. పట్నంలో ఉంటున్న ఇతర జిల్లాల వాసులు పల్లె పోరు కోసం కదిలారు. కొంతమంది సర్పంచ్ అభ్యర్థులు సిటీలో ఉంటున్న బ్యాచ్‌లర్స్‌కు ఛార్జీల కోసం ఆన్లైన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మరీ ఓటేసి పోవాలని కోరడం గమనార్హం. ‘ఏదైతేనేం.. ఓసారి మా ఊరు రాజకీయం చూద్దాం’ అని వేలాది మంది పల్లె బాట పట్టారు. వారు పని చేసే సంస్థలు కూడా సెలవులకు ఓకే చెప్పేశాయ్.
News December 10, 2025
HYDలో నైట్ లైఫ్‌కు కేఫ్ కల్చర్ కిక్

HYD టెక్ స్టూడెంట్స్, క్రియేటర్స్ ‘కేఫ్ కల్చర్’ని కొత్త అడ్డాగా మార్చుకున్నారు. పగలు లాప్‌టాప్‌లతో కో-వర్కింగ్ సెంటర్లుగా, నైట్ బోర్డ్ గేమ్స్, ఓపెన్ మైక్స్, ఇండీ మ్యూజిక్ గిగ్స్‌తో సందడి చేస్తున్నారు. PUBలకు భిన్నంగా ఈ హాట్స్పాట్లు ఉంటాయి. వైన్-డైన్‌కు బదులు కాఫీ, ఫుడ్‌తో యూత్‌ని ఆకర్షిస్తున్నాయి. మద్యం లేకుండా క్రియేటివిటీ, కమ్యూనిటీతో మజా డబుల్ అవుతోంది. దీన్నే స్టడీ పార్టీ అని పిలుస్తున్నారు.
News December 10, 2025
ఓయూకు రూ.1000 కోట్లు

ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు కేటాయిస్తూ CM రేవంత్ రెడ్డి జీవో విడుదల చేశారు. ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఆయన విద్యార్థులకు ఈ నిధులను అంకితం చేశారు. క్యాంపస్‌లో మౌలిక వసతులు, మెరుగైన విద్య, నూతన భవనాల నిర్మాణాలు, విద్యార్థుల కోసం వీటిని ఉపయోగించనున్నారు. ఈ డబ్బు భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం వినియోగించాలని <<18476536>>CM<<>> పేర్కొన్నారు. పేద విద్యార్థులు ఎక్కడా ఇబ్బంది పడొద్దనేది తన సంకల్పం అన్నారు.


