News January 3, 2025
HYD: భారత జాగృతి ఆధ్వర్యంలో నేడు బీసీ సంఘాల సభ

భారత జాగృతి ఆధ్వర్యంలో నేడు HYDలో బీసీ సంఘాల సభ జరగనుంది. ఉదయం 11 నుంచి సా.4 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద BRS MLC కవిత సభను నిర్వహించనున్నారు. సభకు నిన్ననే పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సభ నిర్వహించనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సభలో ప్రధానంగా డిమాండ్ చేయనున్నారు.
Similar News
News October 22, 2025
చర్లపల్లి – దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు

పండుగల రద్దీ దృష్ట్యా చర్లపల్లి, దానాపూర్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. అక్టోబరు 23, 28 తేదీల్లో చర్లపల్లి నుంచి దానాపూర్ (07049), 24, 29 తేదీల్లో దానాపూర్ నుంచి చర్లపల్లి (07092) రైళ్లు నడుస్తాయి. అలాగే, 26న 07049, 27న 07050 నంబరు గల ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.
News October 22, 2025
హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్లో నేడు సదర్ ఉత్సవ మేళా సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా నారాయణగూడలోని వైఎంసీఏ వద్ద ఉత్సవం జరగనున్న నేపథ్యంలో రామ్కోటి, లింగంపల్లి, బర్కత్పూరా, హిమాయత్నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనదారులు అసౌకర్యాన్ని నివారించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
News October 22, 2025
వృద్ధులు, దివ్యాంగులకు రవాణా ఏర్పాట్లు: ఆర్వీ కర్ణన్

ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఆందోళన చెందొద్దని ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. వారిని పోలింగ్ కేంద్రం వరకు తీసుకెళ్లి, తిరిగి ఇంటికి చేర్చే బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేశారు. ఈ సదుపాయం కోసం అర్హులు ఈసీ వెబ్సైట్లో https://ecinet.eci.gov.in/homepage/home తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.