News January 3, 2025
HYD: భారత జాగృతి ఆధ్వర్యంలో నేడు బీసీ సంఘాల సభ
భారత జాగృతి ఆధ్వర్యంలో నేడు HYDలో బీసీ సంఘాల సభ జరగనుంది. ఉదయం 11 నుంచి సా.4 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద BRS MLC కవిత సభను నిర్వహించనున్నారు. సభకు నిన్ననే పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సభ నిర్వహించనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సభలో ప్రధానంగా డిమాండ్ చేయనున్నారు.
Similar News
News January 17, 2025
HYD: కేటీఆర్ వ్యాఖ్యలతో సానుభూతి పోతోంది: అద్దంకి
కేటీఆర్ వ్యాఖ్యలతో ఆయన మీదున్న సానుభూతి పోతోందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఫార్ములా ఈరేస్ కేసులో ఈడీ, ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించడం లేదన్నారు. విచారణ సంస్థల్ని ఆయన టెస్ట్ చేస్తున్నట్లు అనిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టానికి సహకరించడం కేటీఆర్ విధి అని గుర్తుచేశారు.
News January 17, 2025
HYD: బ్రిజేష్ ట్రిబ్యునల్‌ను ప్రభుత్వం స్వాగతిస్తోంది: మంత్రి
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణకు సరైన న్యాయం జరిగేందుకు ఈ తీర్పు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. బచావత్ ట్రైబ్యునల్ ఎన్.బ్లాక్‌గా కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కనుందని తెలిపారు.
News January 16, 2025
ఇబ్రహీంపట్నంలో దారుణం.. యువతిపై అత్యాచారం
HYD శివారు ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన వెలుగుచూసింది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న స్టూడెంట్‌పై అత్యాచారం జరిగింది. పూర్తి వివరాలు.. మంగళ్‌పల్లిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న యువతి పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. గదిలో ఒంటరిగా ఉన్న ఆమెపై అదే భవనంలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద పనిచేసే డ్రైవర్ అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో PSలో కేసు నమోదైంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.