News January 26, 2025
HYD: భారీగా తగ్గిన టమాటా ధరలు

టమాటా ధరలు మునుపెన్నడూ లేని విధంగా పడిపోయాయి. జంట నగరాల అవసరాలకు సరిపడా టమాట ఉత్పత్తి పెరగడంతో ప్రస్తుతం గుడిమల్కాపూర్, ఎల్బీనగర్, బోయిన్పల్లి, మాదన్నపేట మార్కెట్లలో టమాటా ధరలు భారీగా తగ్గాయి. హోల్ సేల్ మార్కెట్లో కిలో రూ.3 నుంచి రూ.8 వరకు ఉండగా.. రిటైల్ మార్కెట్లో కిలో రూ.7 నుంచి రూ.10 వరకు పలుకుతోంది. మీ ప్రాంతంలో ఎంతకు విక్రయిస్తున్నారు.
Similar News
News October 14, 2025
HYD: ‘కాంగ్రెస్ గెలిస్తే జూబ్లిహిల్స్పై వరాల జల్లు’

HYD జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అటు BRSతోపాటు ఇటు కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక్కడి ఫలితాల ప్రభావం ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లపై ఉంటుందని, క్షేత్రస్థాయిలో నాయకులు పర్యటించి కాంగ్రెస్ను భారీ మెజార్టీతో గెలిపించేలా చూడాలని ఇప్పటికే CM రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. కాంగ్రెస్ గెలిస్తే జూబ్లిహిల్స్పై CM వరాల జల్లు కురిపిస్తారంటూ శ్రేణులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నాయి. దీనిపై మీ కామెంట్?
News October 14, 2025
హైదరాబాద్ వాతావరణ సమాచారం

హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో నేడు ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని, ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీయవచ్చని చెప్పింది. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది.
News October 14, 2025
BREAKING: HYD: మీర్పేట్ మంత్రాల చెరువులో మహిళ మృతదేహం కలకలం

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంత్రాల చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని పోలీసులు ఈరోజు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న మిస్సింగ్ కేసులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు.