News April 3, 2024

HYD: భారీగా నోట్ల కట్టలు పట్టివేత

image

HYDలో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉ.6 గంటల వరకు రూ.1,72,21,300 నగదు, రూ.49,90,477 విలువ గల వస్తువులు, 91.17 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. నగదు, ఇతర వస్తువులపై 20 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు చెప్పారు. 4 కేసులు నమోదు కాగా ముగ్గురిపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేసినట్లు వివరించారు.

Similar News

News October 21, 2025

జూబ్లీ బైపోల్.. నేటితో నామినేషన్ల గడువు పూర్తి

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 127 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. 24న ఉపసంహరణకు తుది గడువు. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.

News October 21, 2025

HYD: సదర్ ఉత్సవం.. దద్దరిల్లనున్న సిటీ

image

HYDలో యాదవులు నేడు సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. దీపావళి తర్వాత జరిగే ఈ పండుగ కోసం ఖైరతాబాద్, బోయిన్‌పల్లి, మూసాపేట్ వంటి ప్రాంతాలు సిద్ధమయ్యాయి. హరియాణా నుంచి భారీ దున్నరాజులు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. యాదవ సోదరులు తమ దున్నరాజులతో డప్పులు, ఆటపాటల నడుమ ఊరేగింపుగా వచ్చి, ఒకచోట సదర్‌ను జరుపుకుంటారు.

News October 21, 2025

HYD: సదర్.. దున్నరాజుకు రూ.31 వేల మద్యం

image

ముషీరాబాద్‌లో సదర్ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో కేరళ నుంచి తెచ్చిన 2,500 కిలోల ‘దున్నరాజు’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉత్సవంలో యాదవులు రూ.31,000 విలువైన ‘రాయల్ సెల్యూట్’ బాటిల్‌ను దున్నరాజుకు తాగించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలో సదర్ ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరుగుతున్నాయి.