News June 17, 2024
HYD: భారీగా పెరిగిన టమాట ధర..!

నెల క్రితం టమాటకు ధర లేక మిగిలిపోయిన వాటిని రైతు బజార్లలో వదిలిపోయే పరిస్థితి ఎదురైంది. అప్పట్లో రూ.20లోపు ధర పలికింది. ప్రస్తుతం టమాట ధర భారీగా పెరగడంతో వినియోగదారులు బేజారెత్తిపోతున్నారు. HYD, ఉమ్మడి RRలోని పలు రైతు బజార్లలో అధికారికంగా కిలో రూ.57 పలికింది. బహిరంగ మార్కెట్‌లో మాత్రం రూ.100కు చేరువలో ఉంది. రైతు బజార్లలోనూ ఈ వారంలో రూ.100 పలికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Similar News
News December 22, 2025
రాజేంద్రనగర్: ఫుడ్ పాయిజన్ వార్తల్లో వాస్తవం లేదు: గోవర్ధన్

రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల, వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగిందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని చీఫ్ వార్డెన్ డాక్టర్ గోవర్ధన్ తెలిపారు. శనివారం బి- హాస్టల్లో, హాస్టల్ డే నిర్వహించారని, అందులో కొంతమంది విద్యార్థులు ఆలస్యంగా తినడంతో అజీర్తి అయిందన్నారు. వారికి చికిత్స అందించారు అంతకుమించి ఎలాంటి ఇబ్బంది లేదని, విద్యార్థులు అందరూ సురక్షితంగా ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దన్నారు.
News December 22, 2025
HYD: బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. CI క్లారిటీ

ప్రేమ వేధింపులు భరించలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు మీర్పేట్ సీఐ శంకర్ నాయక్ తెలిపారు. ఆల్మాస్‌గూడకు చెందిన విహారిక(20), కిషోర్ ప్రేమించుకున్నారు. పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించినప్పటికీ కిషోర్ ప్రవర్తన నచ్చక ఆమె దూరంగా ఉంటుంది. దీంతో కాల్స్, మెసేజ్ చేస్తూ మానసికంగా వేధింపులకు గురిచేశాడని యువతి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
News December 22, 2025
FLASH: HYD: లారీ ఢీకొని SI దుర్మరణం

మేడిపల్లి PS పరిధి నారపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో SI ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ప్రకారం.. ఉప్పల్ నుంచి అన్నోజిగూడ వైపు బైక్‌పై వెళ్తున్న AR SI రఘుపతి(59)ని నారపల్లి మసీదు సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


