News August 18, 2024

HYD: భారీ వరద.. హుస్సేన్ సాగర్ గేట్లు OPEN

image

భారీ వర్షాల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అధికారులు శనివారం తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు సాగర్‌లోకి వరద పెరిగిందని, దీంతో నీటిని దిగువకు వదిలామని ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. ఇన్‌ఫ్లో 2,075 క్యూసెక్కులు కాగా.. అవుట్‌ఫ్లో 1,538 క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలామని చెప్పారు.

Similar News

News October 23, 2025

BREAKING: HYD: బేగంపేట్‌లో MURDER

image

HYD బేగంపేట్‌లోని గ్రీన్‌ల్యాండ్ ప్రాంతంలో అస్సాంకు చెందిన ఓ మహిళ మృతి స్థానికంగా కలకలం రేపింది. ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు ఉండడంతో దీనిని హత్యగా పోలీసులు నిర్ధారించారు. స్థానిక టీస్టాల్ యజమాని పొటమచెట్టి పండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ ఎం.రామకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. హత్యకు సంబంధించిన విషయాలపై అనుమానితుల విచారణ ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

News October 23, 2025

HYD: నిమ్స్‌లో అత్యాధునిక శస్త్రచికిత్స పరికరాలు

image

HYD నిమ్స్ ఆస్పత్రిలోని శస్త్రచికిత్స గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందడుగు వేసింది. శస్త్రచికిత్స గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో రూ.2 కోట్ల విలువైన రెండు అధునాతన పరికరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిని డైరెక్టర్ ప్రొఫెసర్ నాగరి బీరప్ప ప్రారంభించారు. ఈ సాంకేతికతలు శస్త్రచికిత్సలో కచ్చితత్వం, రోగి భద్రత, క్లినికల్ సామర్థ్యాన్ని పెంచుతాయని ప్రొఫెసర్ పేర్కొన్నారు.

News October 23, 2025

HYD: నిమ్స్‌లో చరిత్రాత్మక ప్రక్రియ..!

image

నిమ్స్ కార్డియాలజీ విభాగం పల్మనరీ ఆర్టరీ డెనర్వేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి అవగా దేశంలో ఆరోది. తీవ్ర పల్మనరీ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న ఓ చెన్నై మహిళకు ప్రొ.రమాకుమారి బృందం ఈ అత్యాధునిక కేథటార్ చికిత్స అందించింది. రోగి పీఏ ప్రెజర్ 105 నుంచి 88 mmHgకి తగ్గింది. ఈ విజయాన్ని డైరెక్టర్ ప్రొ.బీరప్ప ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో చారిత్రక ఘనత అని కొనియాడారు.