News February 18, 2025
HYD: భార్యను పంపమని ఆమె భర్తనే అడిగాడు..!

పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి నిప్పంటించుకున్న ఘటన మధురానగర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. యాదగిరినగర్లో దంపతులు నివాసం ఉంటున్నారు. భార్యకు సూర్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మద్యం తాగి ఇంటికి వచ్చి ‘మీ భార్యను నాకు ఇచ్చేయ్, జీవితాంతం సంతోషంగా చూసుకుంటా’అని భర్తతో అన్నాడు. భర్త ఆగ్రహించడంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News November 27, 2025
VKB: 262 జీపీలకు నేటి నుంచి నామినేషన్లు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఆయా గ్రామాలకు కేటాయించిన కేంద్రాల్లో ఉ.10:30 గం. నుంచి సా.5 గ. వరకు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. జిల్లాలో మొత్తం 594 పంచాయతీలు, 5,058 వార్డులు ఉండగా తొలి విడతలో 8 మండలాల పరిధిలోని 262 సర్పంచ్, 2,198 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
News November 27, 2025
రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ పబ్లిక్ టాక్

రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ ప్రీమియర్లు USAలో మొదలయ్యాయి. RA-PO వన్ మ్యాన్ షో చేశాడని, చాలారోజుల తర్వాత ఆయన ఖాతాలో హిట్ పడిందని సినిమా చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రామ్-భాగ్యశ్రీ కెమిస్ట్రీ కుదిరిందంటున్నారు. స్క్రీన్ప్లే బాగుందని, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయని చెబుతున్నారు. కొన్నిసీన్లు అసందర్భంగా వస్తాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ.
News November 27, 2025
కరెంట్ షాక్తో కడప జిల్లా యువకుడి మృతి

పులివెందులలోని వాసవీ కాలనీలో బుధవారం రాత్రి యువకుడు చైతన్య విద్యుత్ షాక్తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. యువకుడు ఇంటిలో పిండి గ్రైండింగ్ ఆడిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు.


