News February 18, 2025
HYD: భార్యను పంపమని ఆమె భర్తనే అడిగాడు..!

పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి నిప్పంటించుకున్న ఘటన మధురానగర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. యాదగిరినగర్‌లో దంపతులు నివాసం ఉంటున్నారు. భార్యకు సూర్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మద్యం తాగి ఇంటికి వచ్చి ‘మీ భార్యను నాకు ఇచ్చేయ్, జీవితాంతం సంతోషంగా చూసుకుంటా’అని భర్తతో అన్నాడు. భర్త ఆగ్రహించడంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News March 28, 2025
BREAKING: టాస్ గెలిచిన CSK

చెన్నై వేదికగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నారు.
CSK: రచిన్ రవీంద్ర, రుతురాజ్, త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కర్రన్, జడేజా, ధోనీ, అశ్విన్, నూర్, మతీశా, ఖలీల్
RCB: కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, రజత్, లివింగ్‌స్టోన్, జితేశ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, యశ్ దయాల్
News March 28, 2025
PDPL: SFI పెద్దపల్లి నూతన జిల్లా కమిటీ ఎన్నిక

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాల ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా జిల్లాల ప్రశాంత్, ఎంపికయ్యారు, జిల్లా ఉపాధ్యక్షులు, బందెల రాజ్ కుమార్ సహాయ కార్యదర్శులు, మామిడిపెల్లి అరవింద్, కమిటీ సభ్యులుగా ఆదిత్య, రాజు, మణిరత్నం, అభిరామ్, శివలను ఎన్నుకున్నారు.
News March 28, 2025
డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై శుభవార్త

TG: గత ప్రభుత్వంలో మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. ఇంటి స్థలం లేని అర్హులకు వాటిని కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్ధిదారులే పూర్తిచేసుకునేలా ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో బేస్‌మెంట్ పూర్తిచేసిన వారికి తొలి విడత రూ.లక్ష చెల్లించాలని సూచించారు.