News February 18, 2025

HYD: భార్యను పంపమని ఆమె భర్తనే అడిగాడు..!

image

పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి నిప్పంటించుకున్న ఘటన మధురానగర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. యాదగిరినగర్‌లో దంపతులు నివాసం ఉంటున్నారు. భార్యకు సూర్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మద్యం తాగి ఇంటికి వచ్చి ‘మీ భార్యను నాకు ఇచ్చేయ్, జీవితాంతం సంతోషంగా చూసుకుంటా’అని భర్తతో అన్నాడు. భర్త ఆగ్రహించడంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News November 18, 2025

సీఎం ప్రజావాణిలో 298 దరఖాస్తులు

image

ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 298 దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 90, రెవెన్యూ శాఖకు 54, ఇందిరమ్మ ఇండ్ల కోసం 90, మున్సిపల్ శాఖకు 17, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 45 దరఖాస్తులు అందినట్లు సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జ్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వెల్లడించారు.

News November 18, 2025

తలసానిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్.. మామ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తలసానికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.

News November 18, 2025

సికింద్రాబాద్ MRO ఆఫీసులో ఏసీబీ సోదాలు

image

సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా సర్వేయర్ కిరణ్ పట్టుబడ్డాడు. ఎమ్మార్వో కార్యాలయంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సర్వేయర్ కిరణ్‌తో పాటు చిన్న మెన్ భాస్కర్లను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.