News April 9, 2024
HYD: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD పటాన్చెరు పరిధి అమీన్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణఖేడ్ వాసి కృష్ణ(33) అమీన్పూర్ పురపాలక పరిధి మల్లారెడ్డి కాలనీలోని గెరడా అపార్ట్మెంట్లో వాచ్మెన్గా 10 రోజులుగా పనిచేస్తున్నాడు. అతడి భార్య పుట్టింటికి వెళ్లి రాకపోవడంతో మనస్థాపానికి గురైన అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 10, 2025
HYD: అందెశ్రీకి కులం, మతం లేదు..!

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామానికి చెందిన అందెశ్రీకి కులం, మతం లేదు. ఆయన నలుగురు పిల్లల సర్టిఫికేట్లో కూడా కులం ఉండదు. తన గాయాలను కవితలుగా మలిచారు. ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతమైంది. ‘జై బోలో తెలంగాణా’ అని గర్జించి పాడితే, ఉస్మానియా జనగర్జనలా మారింది. ప్రజా కవి, నంది అవార్డు గ్రహీతగా 64 ఏళ్ల అందెశ్రీ జీవితం కవిత్వం, క్షోభ, కర్మల సమ్మేళనం.
News November 10, 2025
జూబ్లీహిల్స్ పిలుస్తోంది..!

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం జరగనుంది. ఇక్కడి ప్రతి ఓటు ఎంతో కీలకం. నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. అయితే కాస్ట్లీ ఏరియా కాబట్టి అద్దె సంపాదించుకోవచ్చని కొందరు ఓటర్లు తమ సొంతిళ్లను కిరాయికి ఇచ్చి సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. కొందరు కొల్లూరులోని 2BHKలోనూ ఉంటున్నారు. వారందరినీ జూబ్లీహిల్స్ పిలుస్తోంది. ఓటేసి వెళ్లమని చెబుతోంది.
News November 10, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. ఎన్ని పనులున్నా ఓటేసి వెళ్లండి..!

గుర్తుందా.. రేపు నవంబర్ 11.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరిగే రోజు.. మీకు ఎన్ని పనులున్నా.. మీరు ఎంత బిజీ ఉన్నా.. రేపు మాత్రం ఓటేసిన తరువాతే పనులు చూసుకోండి..”ముఖ్యమైన పనులున్నాయి.. వీలుకాదు.. మన ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుంది” అని అనుకోకండి.. అందరూ ఇలా అనుకుంటే ఇక ఓట్లు ఎవరు వేస్తారు? పనులు అందరికీ ఉంటాయి.. అవసరమైతే వాయిదా వేసుకోండి.. ఓటు వేయండి.. ప్లీజ్.


