News March 22, 2025
HYD: భార్య వీడియోలు భర్తకు పంపి.. బ్లాక్ మెయిల్!

విదేశంలో HYD యువతికి వేధింపులు ఎదురయ్యాయి. శ్రీకృష్ణానగర్ వాసి 2018లో పనికోసం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ పరిచయమైన అబూబాకర్ ఆమె వ్యక్తిగత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. 2020లో బాధితురాలు HYD వచ్చేసింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు. ఏకంగా ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. కాల్ చేసినా ఆమె బయటకురావడం లేదని ఆ వీడియోలు ఆమె భర్తకు పంపాడు. ఈ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 18, 2025
శంషాబాద్: గర్భంలోనే కవలలు మృతి.. భర్త ఆత్మహత్య

భార్య గర్భంలోని కవలలు మృతిచెందారనే దుఃఖంతో శంషాబాద్‌లోని సామ ఎన్‌క్లేవ్‌లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆతహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం.. కర్ణాటకకు చెందిన ముత్యాల విజయ్ భార్య శ్రావ్య 8 నెలల గర్భిణీ. కవలల మరణ వార్త తెలిసి విజయ్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 16, 2025
షాద్‌నగర్: ‘నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి’

షాద్‌నగర్ సమీపంలోని ఎల్లంపల్లి గ్రామ యువకుడు రాజశేఖర్ హత్యను బహుజన్ సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హత్యకు ముందు మృతుడిని నిందితులు కిడ్నాప్ చేస్తే కుటుంబ సభ్యులు 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎందుకు రక్షించలేదని ప్రశ్నించారు.