News September 14, 2024

HYD: భార్య సహకారంతో అత్యాచారం.. ఆపై హత్య

image

భార్య సహకారంతో భర్త అత్యాచారం చేసి క్రూరంగా హింసించి హత్య చేసిన కేసుల్లో కోర్టు తీర్పునిచ్చింది. VKB జిల్లా పెద్దేముల్‌‌కు చెందిన భార్యభర్తలు కురువ స్వామి, నర్సమ్మ సంగారెడ్డిలో స్థిరపడ్డారు. కూలీ ఇప్పిస్తామని చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి మహిళలపై హత్యాచారం, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో రంగారెడ్డి కోర్టు భర్తకు 10ఏళ్లు, భార్యకు 7ఏళ్లు, ఇదే తరహా కేసులో మరో ఏడాది జైలుశిక్ష విధించింది

Similar News

News October 11, 2024

తెలంగాణ ఉద్యమకారుల కమిటీ రద్దు: పిడమర్తి రవి

image

తెలంగాణ ఉద్యమకారుల సంఘానికి సంబంధించిన కమిటీని రద్దు చేస్తున్నట్లు సంఘం వ్యవస్థాపకులు డా. పిడమర్తి రవి గురువారం వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కమిటీలో ఉన్న ఛైర్మన్ ఇనుప ఉపేందర్, అధ్యక్షుడు దాసర్ల శ్రీశైలం, కన్వీనర్ MD రహీమ్ కూడిన కమిటీని వెంటనే రద్దు చేస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే తదుపరి కమిటీని ప్రకటిస్తామని ఆయన వివరించారు.

News October 11, 2024

తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం

image

తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపనలు జరగనున్నాయి. 28 ప్రాంతాల్లో ఒకేసారి భవన నిర్మాణాలకు భూమి పూజ చేస్తున్నామని సీఎస్ శాంతి కుమారి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి, మధిరలో డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేస్తారని సీఎస్ ప్రకటించారు.

News October 10, 2024

BREAKING.. HYD: విస్తారా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

image

విస్తారా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన 20 నిమిషాలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు.