News January 12, 2025
HYD: భువనగిరి టోల్ గేట్ వద్ద ఇదీ పరిస్థితి..!
HYD నగరం ఉప్పల్ నుంచి బోడుప్పల్, ఘట్కేసర్ మీదుగా వరంగల్ వైపు వెళ్తున్న మార్గ మధ్యమంలో ఉన్న భువనగిరి టోల్ గేట్ వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచాయి. టోల్ గేట్ నుంచి దాదాపు అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. పలువురు వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్ చేయించుకోకపోవడంతో కాస్త ఆలస్యం అవుతోంది. ఏదేమైనప్పటికీ ఇదే మార్గంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
Similar News
News January 12, 2025
HYD: మాజీ ఎంపీ మృతి పట్ల కేసీఆర్ సంతాపం
మాజీ ఎంపీ, సీనియర్ నేత మందా జగన్నాథం మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కృషిని, పార్టీకి ఆయన అందించిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మందా జగన్నాథం మరణంతో తెలంగాణ సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. శోకతప్తులైన ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
News January 12, 2025
HYD: మాజీ ఎంపీ మృతి పట్ల మంత్రి పొన్నం సంతాపం
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి పట్ల HYD ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 15వ లోక్ సభలో ఆయనతో పాటు మందా జగన్నాథం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారని, ఉద్యమ సమయంలో తనతో కలిసి పని చేశారని, గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహానికి గురై గుండెపోటుతో ఇబ్బందిపడ్డా ఉద్యమాన్ని ఆపలేదని గుర్తుచేసుకున్నారు.
News January 12, 2025
HYD: కేటీఆర్కు మద్దతుగా 5వ తరగతి విద్యార్థి
కేటీఆర్కు మద్దతుగా ‘ఫైట్ హార్డ్ అంకుల్’ అంటూ ఆయన చిత్రాన్ని 5వ తరగతి విద్యార్థి మాణిక్య శ్రీయాన్ రాజ్ గీశాడు. ఫార్ములా-ఈ రేసు కేసులో మద్దతుగా వెళ్లిన శ్రీయాన్.. ఇలా కేటీఆర్పైన అక్రమ కేసులు పెడితే భవిష్యత్తులో HYDకు ఇంకా రేసులు రావని అన్నాడు. బాలుడు గీసిన చిత్రాన్ని కేటీఆర్ టీమ్ తాజాగా Xలో పంచుకుంది.