News March 12, 2025

HYD: భూగర్భజలాలను తోడేస్తున్నారు!

image

నగర శివారులో భూగర్భజలాలు తగ్గడంతో వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి సమయంలో శంకర్‌పల్లి, జన్వాడ, పూర్ణనంద ఆశ్రమం రోడ్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో బోర్లువేసి కొందరు నీటిని తోడేస్తున్నారు. దీనివలన ఆయా ప్రాంతాల్లో లో ప్రెషర్ సమస్యలతో‌ ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, వట్టినాగులపల్లి, ఖానాపూర్ గ్రామాల్లో ఏకంగా 25 బోర్లను అధికారులు సీజ్ చేశారు.

Similar News

News October 30, 2025

BREAKING: హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య

image

HYDలో దారుణ ఘటన వెలుగుచూసింది. బండ్లగూడలో బుధవారం రాత్రి ఓ పాన్ షాపు యజమాని దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోసిన్ (22) ఓల్డ్ సిటీకి చెందినవాడు. ఇతడికి రెండు నెలల క్రితమే వివాహమైంది. నలుగురు గుర్తు తెలియని దుండగులు దుకాణం వద్ద కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News October 28, 2025

జూబ్లీ బైపోల్: మంత్రులకు బాధ్యతలు

image

జూబ్లీహిల్స్ బైపోల్‌లో భాగంగా డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
రహమత్‌నగర్- కోమటిరెడ్డి, పొంగులేటి, బోరబండ- సీతక్క, మల్లు రవి, వెంగళ్‌రావునగర్- తుమ్మల, వాకిటి శ్రీహరి, సోమాజిగూడ- శ్రీధర్ బాబు, అడ్లూరి, షేక్‌పేట్- కొండా సురేఖ, వివేక్, ఎర్రగడ్డ- దామోదర, జూపల్లి, యూసుఫ్‌గూడ- ఉత్తమ్, పొన్నం ప్రభాకర్‌కు కేటాయించారు.

News October 28, 2025

శంకర్ మఠాన్ని సందర్శించిన రాంచందర్‌రావు

image

HYDలోని నల్లకుంట శృంగేరి శంకర్ మఠాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సందర్శించారు. శ్రీ శారదాంబ అమ్మవారిని దర్శించుకొని, దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువు శంకరాచార్య శ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.